గ్లామ్‌షాట్‌: బ్లాక్‌ హాట్‌ జవరాలు అదరహో వయ్యారాలు.!

మరిన్ని వార్తలు

అహో.! పిక్‌ సూపర్‌ ఫిగర్‌ అదుర్స్‌ అన్నట్లుంది కదా. ఇంతకీ పిక్‌లో ఉన్న ఈ పిటపిటలాడే బ్యూటీ ఎవరో తెలుసా.? ప్రియాంకా జవాల్కర్‌. ఈ మధ్యనే తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పింది. విజయ్‌ దేవరకొండ నటించిన 'ట్యాక్సీవాలా' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తొలిచూపులోనే బాగా ఎట్రాక్ట్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ పదహారణాల తెలుగమ్మాయి అన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

ఇకపోతే 'ట్యాక్సీవాలా'తో దక్కించుకున్న గుర్తింపు కెరీర్‌లో ఈ ముద్దుగుమ్మకి ఎలా ఉపయోగపడుతుందనే ది ఇంకా తెలీదు కానీ, వాడుకుంటే మంచి విషయం ఉన్న నటి అని మాత్రం ఆడియన్స్‌ గుర్తించారు. మన దర్శక, నిర్మాతలు కూడా గుర్తిస్తే ఆమెకు అవకాశాలు పోటెత్తడం ఖాయం.

ఇక తెలుగమ్మాయి కదా, గ్లామర్‌కి దూరం అనుకుంటే పొరపాటే. కథని బట్టి, సిట్యువేషన్‌ని బట్టి పుష్కలంగా గ్లామర్‌ ఒలకబోసేందుకు కూడా అమ్మడు సిద్ధమేనట. చూస్తున్నారుగా ఈ బ్లాక్‌ శారీలో ప్రియాంకా సృష్టిస్తున్న గ్లామర్‌ వైబ్రేషన్స్‌ ఎలా ప్రసరిస్తున్నాయో.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS