తన కన్నుగీటుతో యావత్ దేశాన్నే ఒక్క కుదుపు కుదిపిన ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నది.
కారణం- ఆ సినిమాలో ఆమె కన్నుగీటే సమయంలో వచ్చిన పాట తమ మనోభావాలని దెబ్బతీసేలా ఉంది అని ఆమె పైన ఆ చిత్ర దర్శకుడి పైన దేశంలోని వేరు వేరు చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇదే అంశం పైన ఆమె తనపైన ఎటువంటి క్రిమినల్ చర్యలు లేకుండా స్టే ఇవ్వవలసిందిగా ఆమె సుప్రీమ్ కోటుని ఆశ్రయించారు.
అమె విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు ఆ అభ్యర్ధనను స్వీకరించింది. దీని పైన రేపు వాదనలు వింటాము అని తెలిపింది. దీనితో ఆమె ఈ కేసులో కాస్త ఊపిరి పీల్చుకున్నది. ఒక చిన్న పది సెకండ్ల వీడియో తో స్టార్ డం తెచ్చుకున్న ఈ అమ్మడు అంతేస్థాయిలో వివాదంలో సైతం ఇరుక్కున్నది.
మొత్తానికి ప్రియా ప్రకాష్ ఒకసారి కన్నుగీటిన పాపానికి అది కూడా ఒక చిత్రం కోసం చేసినదానికి కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది.