రకుల్ ప్రీత్‌సింగ్ తెలుగులో తిరిగి తన సత్తా చాటేందుకు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన రకుల్‌కి తెలుగులో మళ్లీ ప్లాట్‌ఫామ్ సిద్ధం చేసుకోవడం కత్తి మీద సామే అయ్యింది. దొరక్క దొరక్క 'ఎన్టీఆర్'లో స్పెషల్ రోల్‌కి ఛాన్స్ దక్కిందనుకుంటే, ఆ సినిమా రిజల్ట్ అలా అయిపోవడంతో రకుల్‌ని పెద్దగా పట్టించుకోలేకపోయారు అభామానులు. ఇదిలా ఉంటే 'వెంకీ మామ' చిత్రంలో చైతూకి జోడీగా రకుల్ ఎంపికైందని సమాచారమ్ అందుతోంది. అయినా ఆ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు.
అంతకన్నా ముందే రకుల్‌కి తెలుగులో ఓ మంచి హిట్ కావాలి. ఐటెం సాంగ్‌లోనైనా నర్తించేందుకు సై అంటోంది. కానీ ఆ అదృష్టం కూడా రకుల్ తలుపు తట్టడం లేదు. తాజాగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్న 'దేవ్' చిత్రం వేలంటైన్స్ డేకి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కార్తీ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఆ రకంగా 'దేవ్' సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. వన్స్ ఈ సినిమా పోజిటివ్ టాక్ తెచ్చుకుందంటే, తెలుగులో మళ్లీ రకుల్ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టేస్తారు.
అయితే ఇక్కడే ఓ చిన్న చిక్కొచ్చిపడింది. ఇదే రోజు రకుల్‌కి పోటీగా ప్రియా వారియర్ కూడా వస్తోంది. ప్రియా నటించిన మలయాళ మూవీ 'ఒరు అధార్ లవ్' తెలుగులో 'లవర్స్‌డే' పేరుతో విడుదలవుతోంది. భాషతో సంబంధం లేకుండా ప్రియా వారియర్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్ లవర్స్‌డేకి వర్కవుట్ అయ్యిందంటే ఇక అంతే సంగతి. తెలుగులో రకుల్ ఈ సారైనా ఏం చేస్తుందో ఏమో లెట్స్ వెయిట్ అండ్ సీ.!