గొడుగు పట్టడం అంటే ఆదుకోవడం, మద్దతివ్వడం వంటి అర్ధాలు వస్తుంటాయి. ఏం చెప్పినా ఊ కొట్టడం అనే మీనింగ్ కూడా పరిగణనలోనికి తీసుకోవచ్చు. అయితే అసలేంటీ.. 'గొడుగు' కథ అంటే, కేన్స్ ఈవెంట్‌లో దేశీ గాళ్ ప్రియాంకా తన ప్రియుడు కమ్ యంగ్ హజ్‌బెండ్‌తో రెడ్ కార్పెట్‌పై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇది బాగానే ఉంది. కొత్తేముంది.. అసలా గొడుగు కథేంట్రా బాబూ.. అంటారా.. ఆగండాగండి అక్కడికే వచ్చేస్తున్నాం.
రెడ్ కార్పెట్‌పై తాజాగా నిక్‌తో కలిసి ప్రియాంకా సూపర్ స్టైలింగ్స్ ఇస్తూ కేక పుట్టిస్తోంది. ఇందులో భాగంగా యువరాణిలా మెడలో డైమండ్ నక్లెస్ ధరించిన ప్రియాంకా చోప్రాకి పక్కనే వైట్ సూట్‌లో నిక్ గొడుగు పట్టి నిలబడిన దృశ్యం చూపరులను తెగ ఆకర్షించేస్తోంది. ఆకర్షణేనా.? నిక్‌ని చూసి మగాళ్లంతా నేర్చుకోవాలి.. అంటూ నెట్టింట్లో కామెంట్లు కూడా వచ్చేస్తున్నాయి.
ఇదే కాదు, రకరకాల కాస్ట్యూమ్స్‌తో కేన్స్‌లో ఈ జంట చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదు. కొన్ని స్టిల్స్‌లో అయితే, ప్రియాంకా కాస్ట్యూమ్స్ చూసి అయ్యో.! ప్రియాంకకు బట్టలు ఇంత కరువా.. అమ్మా ప్రియాంకమ్మ స్టైలింగ్ పేరుతో ఏంటీ అరాచకమమ్మా.. ఇక చాలించు తల్లీ.. అంటూ నెగిటివ్ విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ, ప్రియాంకా ఇవన్నీ పట్టించుకుంటుందా.? నో వే దటీజ్ దేశీ గాళ్.