ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన నిరవ్ మోడీ పైన ఆర్ధిక నేరాల క్రింద కేసు నమోదు అవ్వడం దీనికి ప్రధాన కారణం పంజాబ్ నేషనల్ బ్యాంకుని ఆయన సుమారు రూ 300కోట్ల రూపాయల మేర మోసం చేసాడట.
ఇక ఈయన వజ్రాల బ్రాండ్ కి ప్రచారకర్త అయిన ప్రియాంక చోప్రా నిరవ్ మోడీకి నోటిసులు పంపడం ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆసక్తికరంగా మారింది. ఆమె ప్రచారం నిర్వహించినందుకుగాను ఆమెకి పారితోషకం ఇవ్వనందునే ఆమె నోటిసులు పంపారని తెలుస్తున్నది. ఇదే బ్రాండ్ కి మరొక ప్రచారకర్తగా పని చేసిన హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకి కూడా వారు చెల్లింపులు చేయలేదు అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం నిరవ్ మోడీ వల్ల ఒక నేషనల్ బ్యాంకు నష్టాల్లోకి కూరుకుపోయింది అని తెలుస్తున్నది. ఏదేమైనా ఇందులో సినీ తరాల పేర్లు వినపడడం, వారు తిరిగి తిరిగి నిరవ్ మోడీకి నోటిసులు పంపడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.