'ట్యాక్సీవాలా' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రియాంకా జవాల్కర్‌కి తొలి సినిమాకే క్రేజ్ బాగానే వచ్చింది. ఎంతైనా క్రేజీ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది కదా. అయితే ఆ తర్వాత అమ్మడికి మరో అవకాశమేం వచ్చినట్లు లేదు. ఇటీవల అఖిల్ సినిమాలో ప్రియాంకా జవాల్కర్ ఛాన్స్ దక్కించుకుందంటూ గుసగుసలు బాగా వినిపించాయి. అయితే అదేం లేదనీ తాజాగా అందుతోన్న సమాచారమ్. ప్రియాంకా జవాల్కర్ అసలు సిసలు తెలుగమ్మాయి. అనంపూర్ వాసి. మామూలుగానే మన తెలుగమ్మాయిలకు ఇండ్రస్టీలో ఆదరణ తక్కువ అనే నింద ఉంది.
ఆ నింద ఇప్పుడు ఇంకోసారి ప్రూవ్ అయ్యేలా ఉంది. వచ్చిన అవకాశం చేజారిపోయిందంటే ఇంకేమనాలి.? ఇక అఖిల్ సినిమా విషయానికి వస్తే, 'బొమ్మరిల్లు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ చేతికి చిక్కాడు అఖిల్. వరుసగా మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి అఖిల్‌కి. ఈ మూడు సినిమాల కోసం తలలు పండిన సీనియర్ డైరెక్టర్స్‌నీ, ట్రెండింగ్‌లో ఉన్న కొత్త డైరెక్టర్‌నీ కూడా టచ్ చేసేశాడు అఖిల్.
ఇక గతంలోకి ఒకసారి తొంగి చూసే ప్రయత్నం చేస్తున్నాడు తాజా చిత్రంతో. ఆ క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక హీరోయిన్‌గా మొదటి రెండు సినిమాలకీ సాయేషా, కళ్యాణీ ప్రియదర్శన్.. ఇద్దరు ముద్దుగుమ్మల్ని పరిచయం చేసిన అఖిల్ ఈ సినిమా కోసం మరో కొత్త భామని ప్రిఫర్ చేస్తున్నట్లు సమాచారమ్.