సినిమావాళ్లకు ఆరోగ్యంపై దృష్టి ఎక్కువ. చాలామంది యోగా చేస్తుంటారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా యోగాలో దిట్టనే. ఆయన ప్రతీరోజూ యోగా చేస్తుంటారు. ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ఓ వీడియోని విడుదల చేశారు కృష్ణం రాజు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాకి గజగణ వణికిపోతోంది. కరోనా నుంచి కాపాడుకోవడానికి మార్గాలు అన్వేషిస్తోంది. ఇమ్యునిటీ పెంచుకోవడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. యోగా ద్వారా ఇమ్యునిటీ పెంచుకోవడం ఎలా? అనే విషయంపై కృష్ణం రాజు కొన్ని సలహాలూ, సూచనలు అందించారు. ప్రాణక్రియ లాంటి యోగా పద్ధతుల్ని చేసి చూపించారు. ఇవన్నీ ప్రతీరోజూ ప్రాక్టీస్ చేస్తే, ఇమ్యునిటీ శక్తిని పెంపొందించుకోవచ్చనీ, తద్వారా కరోనాని తరిమికొట్టొచ్చని అభిమానులకు పిలుపు నిచ్చారు.