నిర్మాత‌ల‌ను భ‌య‌పెడుతున్న రూమ‌ర్లు

By Gowthami - June 15, 2021 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నాడు. త‌న చేతిలో ప్ర‌స్తుతానికి మూడు సినిమాలున్నాయి. మ‌రో మూడు... పైప్ లైన్ లో ఉన్నాయి. `హ‌రి హ‌ర వీర‌మల్లు`, `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్ ప‌వ‌న్ త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌నుకుంటున్నాడు. ఆ త‌ర‌వాత‌.. హ‌రీష్ శంక‌ర్ సినిమా ఉంటుంది. మ‌రో ముగ్గురు నిర్మాత‌లు ప‌వ‌న్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. అయితే ఈలోగా ప‌వ‌న్ కెరీర్‌పై కొన్ని రూమ‌ర్లు వ్యాపించాయి. వీలైనంత త్వ‌ర‌గా... ప‌వ‌న్ సినిమాల‌కు గుడ్ బై చెబుతాడ‌ని, హ‌రీష్ శంక‌ర్ సినిమా త‌ర‌వాత ప‌వ‌న్ సినిమాలు చేయ‌డ‌ని, పూర్తిగా రాజ‌కీయాల్లో లీన‌మ‌వుతాడ‌ని వార్త‌లొస్తున్నాయి.

 

ఈ వార్త‌లు టాలీవుడ్ నిర్మాత‌ల్ని క‌ల‌వ‌ర పెడుతున్నాయి. ప‌వ‌న్ పై ఆశ‌లు పెట్టుకున్న ద‌ర్శ‌కులు, నిర్మాత‌లూ... ఇప్పుడు టెన్ష‌న్ లో ప‌డ్డారు. అతి త్వ‌ర‌లోనే... `అప్ప‌య్య‌యుమ్‌..` సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈసినిమా కోసం ప‌వ‌న్ మ‌రో 20 రోజులు కాల్షీట్లు స‌ర్దుబాటు చేస్తే చాల‌ని తెలుస్తోంది. ఆ వెంట‌నే క్రిష్ మూవీనీ ఫినిష్ చేస్తాడ‌ట‌. ఇప్ప‌టికే క్రిష్ మూవీకి సంబంధించిన సెట్ వ‌ర్క్ మొద‌లైపోయింది. మ‌హా అయితే.. అక్టోబ‌రు నాటికి ప‌వ‌న్ ఈ రెండు సినిమాలూ లాటించేస్తాడు. ఆ వెంట‌నే హ‌రీష్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది.

 

ఈ సినిమాని మూడు నెల‌ల్లో పూర్తి చేయాల‌న్న‌ది టార్గెట్. అంటే.. 2022 వేస‌వికి హ‌రీష్ సినిమా కూడా విడుద‌లైపోతుంది. ఆ వెంట‌నే.. ప‌వ‌న్ రాజ‌కీయ వ్యూహాల్లోకి వెళ్లిపోతాడ‌ని అంటున్నారు. అయితే.. ప‌వ‌న్ కి మ‌రో సినిమా కూడా చేసే ఛాన్సుంద‌ని, ఆ సినిమా ఎవ‌రికి అప్ప‌గించాలా? అనే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్నాడ‌ని తెలుస్తోంది. త‌న పొలిటిక‌ల్ కెరీర్‌కి ఉప‌యోగ‌ప‌డేలా ప‌వ‌న్ ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ని, అలాంటి క‌థ కూడా సిద్ధ‌మ‌వుతుంద‌ని టాక్. మ‌రి.. ప‌వ‌న్ మ‌న‌సులో ఏముందో.. ఆయ‌న నోరు విప్పితే గానీ తెలీదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS