ఉర్రూతలూగిస్తోన్న 'సాహో' సయ్యా సైకో!

By iQlikMovies - July 08, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

మొన్న శాంపిల్‌గా 'సాహో' నుండి తొలి సాంగ్‌ టీజర్‌ ప్రోమోని వదిలారు. మిశ్రమ స్పందన వచ్చింది ఈ ప్రోమోకి. అయితే లేటెస్ట్‌గా వదిలిన మరో టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అదే సాంగ్‌ని ఇంకొంచెం ఎక్కువ లెంగ్త్‌లో వదిలారిప్పుడు. దాదాపు రెండున్నర నిమిషాల వ్యవధి ఉన్న ఈ సాంగ్‌ వీడియోలో ప్రబాస్‌, శ్రద్ధాకపూర్‌ లుక్స్‌ స్టైలిష్‌గా ఆకట్టుకుంటున్నాయి. ఇదో పబ్‌ సాంగ్‌. మధ్యలో శ్రద్ధాకపూర్‌ డ్రింక్‌ చేయడం, ఆమెకు మత్తెక్కి, ఫ్యాన్స్‌కి కిక్కెక్కించడం కనిపిస్తోంది. ఆ మధ్యలోనే కొన్ని యాక్షన్‌ సీన్స్‌ కూడా మిక్స్‌ చేశారు. మొత్తానికి 'ఆగడిక సైకో సయ్యా..' అంటూ సాగే ఈ సాంగ్‌ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోందనే చెప్పాలి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ సినిమాకి ఇంతవరకూ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ పేరును అఫీషియల్‌గా అనౌన్స్‌ చేయలేదు. శంకర్‌ ఎహ్‌సాన్‌ లాయ్‌ త్రయం మ్యూజిక్‌ విభాగం నుండి తప్పుకున్నాక, ఆ ప్లేస్‌ని భర్తీ చేసిన మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరో ఇంతవరకూ ప్రకటించలేదు. గిబ్రాన్‌ ఈ సినిమాకి బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు. తాజా సాంగ్‌కి మాత్రం తనిష్క్‌ బగ్చినే సంగీతమందించారు. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS