వేడి ముద్దుల కోసం... సైడ్ హీరోయిన్‌నీ వ‌ద‌ల్లేదు

మరిన్ని వార్తలు

అర్జున్ రెడ్డి, ఆర్‌.ఎక్స్ 100 మ‌హిమ వ‌ల్ల‌.. తెలుగు తెర‌పై ఇంగిలీసు ముద్దుల గోల ఎక్కువైపోయింది. పెదవీ, పెద‌వీ పెన‌వేసుకోకుండా ఒక్క సినిమా కూడా ఉండ‌డం లేదు. చిన్న సినిమాలైతే 'ఎన్ని ముద్దులు పెట్టుకుంటే అంత బ‌లం' అన్న‌ట్టు త‌యార‌వుతున్నాయి. ముద్దులు చూసి జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారో లేదో తెలీదు గానీ, ప్ర‌చార చిత్రాల్లో మాత్రం ముద్దుల‌తో మోతెక్కిస్తున్నాయి. 

 

తాజాగా విడుద‌లైన `వేర్ ఈజ్ వెంకట‌ల‌క్ష్మి` ట్రైల‌ర్‌లో కూడా ఇంగిలీసు ముద్దులు క‌నిపించాయి. ల‌క్ష్మీరాయ్ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్ర‌మిది. ల‌క్ష్మీరాయ్ సినిమాకాబ‌ట్టి.. ఆ ముద్దేదో త‌న‌నే పెట్టేసుకున్నాడేమో అనుకుంటే పొర‌పాటు. ఈ సినిమాలో సైడ్ హీరోయిన్‌గా చేసిన పూజిత పొన్నాడ ఈ పెద‌వెంగిలి సీన్‌లో విజృంభించింది. ఆ సీన్‌లో పూజిత ఇన్‌వాల్వ్‌మెంట్ చూస్తే.. ఇలాంటి స‌న్నివేశాల‌కు తాను ఎప్పుడూ సిద్ధ‌మే అనే సంకేతాలు పంపిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. 

 

ఇందులో ఇలాంటి ముద్దులు, హాట్ హాట్ స‌న్నివేశాలు చాలానే ఉన్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి ల‌క్ష్మీరాయ్ ఏం చేస్తోంది? అంటారా.. తాను కూడా హాట్ స‌న్నివేశాల్లో క‌నిపిస్తుంద‌ట‌. కానీ ముద్దులు మాత్రం పెట్టుకోద‌ట‌. ఇదో హార‌ర్ కామెడీ సినిమా. భ‌య‌పెట్టే బాధ్య‌త మాత్రం తాను తీసుకుంది. గ్లామ‌ర్ వాటా అంతా పూజిత‌కే ఇచ్చేశారు. మ‌రి వీరిద్ద‌రిలో ఎవ‌రికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS