పూరితో ప‌వ‌న్ సినిమా.. నిజ‌మెంత‌..??

By Gowthami - February 27, 2020 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ - పూరి జ‌గ‌న్నాథ్‌లు మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేస్తున్నార‌ని, వీరి కాంబోలో సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప‌వ‌న్ - పూరి కాంబో అంటే ఆ క్రేజే వేరు. బ‌ద్రి సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర‌వాత వ‌చ్చిన కెమెరామెన్ గంగ‌తో రాంబాబు ప‌ల్టీలు కొట్టింది. అయినా స‌రే.. ఈ కాంబో అన‌గానే అంచ‌నాలు పెరిగిపోతాయి. పైగా ఇస్మార్ట్ శంకర్ త‌ర‌వాత పూరి ఫామ్‌లోకి వచ్చేశాడు. త‌క్కువ రోజుల్లో సినిమాని పూర్తి చేసి ఇవ్వ‌గ‌ల‌డు. అందుకే ఈ కాంబినేష‌న్ అన‌గానే అంద‌రిలోనూ ఆస‌క్తి మొద‌లైంది. కాక‌పోతే.. ఈ వార్త కేవ‌లం గాసిప్పు మాత్ర‌మే. అస‌లు ఇలాంటి ప్ర‌తిపాద‌న ఏదీ పూరి ద‌గ్గ‌ర‌కు రాలేద‌ని పూరి సన్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.

 

పూరి ప్ర‌స్తుతం ముంబైలో ఉన్నాడు. అక్క‌డ విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాతో బిజీ. ఆ సినిమా పూర్త‌య్యేంత వ‌ర‌కూ మ‌రో సినిమాపై దృష్టి పెట్టే ఛాన్సే లేదు. పోనీ ఈలోగా క‌ర్చీప్ వేశారా? అంటే... అస‌లు అలాంటి టాపిక్కే పూరి ద‌గ్గ‌ర‌కు ఎవ‌రూ తీసుకురాలేదు. మ‌రి ఈ వార్త ఎలా పుట్టిందో..??


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS