పుష్ప 2 షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కాకపోతే.. ఫస్ట్ లుక్, గ్లిమ్స్ మాత్రం తయారైపోతున్నాయి. డిసెంబరు 16న పుష్ప 2 గ్లిమ్స్ బయటకు రానుందని టాక్. అవతార్ 2 సినిమాతో పాటుగా గ్లిమ్స్‌ని విడుదల చేసే అవకాశం ఉంది. అవతార్ 2 ఆడుతున్న థియేటర్లలో ఈ గ్లిమ్స్‌ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. అయితే అంతకంటే ముందే ఫస్ట్ లుక్ బయటకు రాబోతోందని సమాచారం. పుష్ప 2 సెట్స్‌కి వెళ్లే ముందే ఫస్ట్ లుక్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు సుకుమార్. అందుకు సంబంధించిన ఫొటో షూట్ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు ఫస్ట్ లుక్‌ని అధికారికంగా విడుదల చేయడమే తరువాయి.
ఈ వారంలోనే... పుష్ప నుంచి ఓ క్రేజీ అప్ డేట్ రాబోతోందని, అందులో భాగంగా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేస్తారని చెబుతున్నారు. పుష్ప కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ ప్రత్యేకమైన సెట్ రూపొందించారు. దాంతో పాటు అల్లు స్టూడియోస్ లో కూడా సెట్ నిర్మించారు. ఈ రెండు చోట్లా.. పుష్ప 2 షూటింగ్ జరగబోతోంది. బ్యాంకాక్ అడవుల్లోనూ కొంతమేర షూటింగ్ చేస్తారు. కాకపోతే.. ఆ షెడ్యూల్‌లో బన్నీ లేడని తెలుస్తోంది.