అల్లు అర్జున్ `పుష్ప` టీజర్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బన్నీ బర్త్ డే సందర్భంగా `పుష్ఫ` టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ యూ ట్యూబ్ లో కొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటూనే ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టీజర్ నుంచి ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ ని వేగంగా రాబట్టిన టీజర్ గా ఘనత వహించింది. ఇప్పుడు మరో రికార్డును పుష్ప చిత్రం ఖాతాలో వేసుకుంది. 60 మిలియన్ వ్యూస్ ని అతి తక్కువ సమయంలో సాధించిన టీజర్ గా.. పుష్ష చరిత్ర సృష్టించింది.
1.4 మిలియన్ లైక్స్ ఇప్పటికే పుష్ష సొంతం. ఇది కూడా ఓ రికార్డే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే.. పుష్ష నుంచి తొలి పాట రానుందని తెలుస్తోంది. ఈ పాటని అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయబోతున్నార్ట. దేవిశ్రీ - సుకుమార్ కాంబినేషన్‌లో ఎలాంటి పాటలు వచ్చాయో మనందరికీ తెలిసిందే. అవన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మరి పుష్ష పాటలెలా ఉంటాయో చూడాలి.