అందాల 'రాశి' యమ హాట్‌ గురూ!

మరిన్ని వార్తలు

సినిమా సినిమాకీ గ్లామర్‌ డోస్‌ పెంచుకుంటూ వెళుతోన్న రాశి ఖన్నా, తన తాజా చిత్రం 'టచ్‌ చేసి చూడు'లో ఇంకాస్త రెచ్చిపోయినట్లే కన్పిస్తోంది అందాల ప్రదర్శన కోణంలో చూస్తే. ఇంతకు ముందెన్నడూ లేనంత హాట్‌గా రాశి ఖన్నా ఈ సినిమాలో అందాల విందు చేసేసిందట. 'టచ్‌ చేసి చూడు' తాజా ప్రోమోలో రాశి ఖన్నా, ఏకంగా హీరో రవితేజకి లిప్‌ టు లిప్‌ కిస్‌ కూడా ఇచ్చేసింది. ఓ సీన్‌లో రాశి ఖన్నా బికినీ గ్లామర్‌ ప్రదర్శించేసినట్లే అన్పిస్తోంది. 

కాస్ట్యూమ్స్‌ పరంగానే చాలా జాగ్రత్తలు తీసుకుని, రాశి ఖన్నా గ్లామర్‌ని బాగా ఎలివేట్‌ చేసినట్లు అర్థమౌతోంది. రవితేజ - రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీ పీక్స్‌లో ఉందని ఈ ప్రోమో చూశాక ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి 'బెంగాల్‌ టైగర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమాలోనూ రాశి ఖన్నా బికినీలో రెచ్చిపోయింది. అంతకు మించిన స్థాయిలో 'టచ్‌ చేసి చూడు' సినిమాలో రాశి ఖన్నా గ్లామర్‌ ప్రదర్శించనుందని సమాచారమ్‌. 

ఇంకో గ్లామరస్‌ బ్యూటీ సీరత్‌ కపూర్‌ తక్కువేమీ తిన్లేదట. అసలే సీరత్‌ అనగానే గ్లామరస్‌ బ్యూటీ గుర్తుకొస్తుంది. దర్శకుడు ఆమె గ్లామర్‌నీ ఓ రేంజ్‌లో సినిమా కోసం వాడేశాడని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ నుంచి సమాచారమ్‌ అందుతోంది. ఇటీవలే 'రాజా ది గ్రేట్‌' అంటూ సక్సెస్‌ అందుకున్న మాస్‌ మహరాజ్‌, మరోసారి 'టచ్‌ చేసి చూడు' సినిమాతో హిట్టు కొట్టేలా ఉన్నాడు. ఆ మేకింగ్‌, ఆ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అన్నీ అద్భుతహ అనేలా ఉన్నాయంటే సినిమా ఆల్రెడీ సగం సక్సెస్‌ కొట్టేసినట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS