రాశీఖన్నా కష్టం ఎందుకోసం?

మరిన్ని వార్తలు

కొంచెం బొద్దుగా ఉండే రాశీఖన్నా ఇప్పుడు తెగ కష్టపడిపోతూ, బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. మొన్నీ మధ్యనే 'తొలిప్రేమ' సినిమాతో సూపర్‌ సక్సెస్‌ కొట్టిన రాశీఖన్నా ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతోంది. 

తెలుగు సినిమాలతో పాటు, తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. అయితే వీటిలో ఏ సినిమా కోసం రాశీ ఇంతగా కష్టపడుతోందో తెలియడం లేదు. ఒకవేళ మరీ సన్నబడి జీరోసైజ్‌ కోసం ఏమైనా ట్రై చేస్తుందో ఏమో గానీ, ఏది ఏమైనా రాశీఖన్నా సన్నబడడానికి చేస్తున్న వర్కవుట్లు చూస్తుంటే మాత్రం భలే ముచ్చటేసుకొస్తోంది. అయినా ఇటీవల విడుదలైన 'తొలిప్రేమ'లో రాశీఖన్నా ఏమంత బొద్దుగా కూడా లేదు. 

ప్రస్తుతం యంగ్‌ హీరో నితిన్‌తో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో నటిస్తోంది రాశీఖన్నా. ఈ సినిమాలో కూడా మామూలుగానే కనిపిస్తోంది పోస్టర్స్‌లో. ఇవే కాక మరిన్ని బిగ్‌ బ్యానర్‌ చిత్రాల్లో రాశీ నటిస్తోందిప్పుడు. ఒకవేళ ఆ సినిమాల్లో దేనికోసమైనా బరువు తగ్గించాల్సి వచ్చిందేమో. ఎంత కష్టపడినా ఈ ముద్దుగుమ్మ ఫుడ్‌ డైటింగ్‌ మాత్రం చేయనని చెబుతోంది. ఫుడ్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనంటోంది. తనకి నచ్చింది తింటుందట. అయితే కొంచెం ఎక్కువగా జిమ్‌లో కష్టపడతానంటోంది అంతే. 

ఏది ఏమైనా మంచి సక్సెస్‌ ముందు ఈ కష్టం ఏ పాటిదిలే అని చాలా లైట్‌గా చెప్పేస్తోంది. రాశీఖన్నాలోని ఆ ఆటిట్యూడ్‌ని మెచ్చుకుని తీరాల్సిందే మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS