బహుముఖ ప్రజ్ఞాశాలి రావికొండలరావు మరణ వార్త.. చిత్రసీమని విషాదంలో నింపింది. రచయితగా, నటుడిగా - తన ప్రతిభని పలు విధాలుగా చూపించిన రావికొండలరావు, ఆనాటి పాత సినిమా విషయాల్ని ఈనాటి సినీ ప్రియులకు పరిచయం చేయడంలో దిట్ట. ఆయన రాసిన సినిమా పుస్తకాలు బహుళ ఆదరణ పొందాయి. హ్యూమరసం 1, హ్యూమరథం 2.. సినీ పుస్తక ప్రియుల్ని అలరించాయి.
పాత సినిమాల విశేషాల్ని వివరించి. బ్లాక్ అండ్ వైట్ కి నంది పురస్కారం లభించింది. అక్కినేని `మనసులో మాట` రచయిత.. రావి కొండలరావునే. సితార సినీ వార పత్రికలో `పాత బంగారం` పేరుతో ప్రతీవారం సినీ వ్యాసాలు అందించేవారు. మాయాబజార్, మల్లీశ్వరీ సినిమా నవలల్నీ ఆయన రాశారు. అంతేకాదు.. కథలు, నాటికలు... చాలానే అందించారు. ఓరకంగా చెప్పాలంటే.. ఆ తరానికీ, ఈ తరానికీ ఓ వారధిలా పనిచేశారు రావి కొండలరావు. ఆయన్ని కోల్పోవడం నిజంగా తీరని లోటే.