ఫ్యాన్స్‌కి లారెన్స్‌ స్వీట్‌ వార్నింగ్‌.!

మరిన్ని వార్తలు

తమ అభిమాన హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు చూపించే అత్యుత్సాహం అంతా ఇంతా కాదు, తాజాగా లారెన్స్‌ రాఘవ అభిమానులు చెన్నైలో కాస్త ఎక్కువ అత్యుత్సాహమే ప్రదర్శించారు. నిజానికి ఇదంతా సర్వసాధారణమే. ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయమే. సోషల్‌ మీడియా వచ్చాక వైరల్‌ వీడియోలు నిముషాల్లో సుదూర దూరాలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. అలా చివరికి ఆ అభిమాన హీరో చెంతకు ఈజీగా చేరిపోతున్నాయి.

 

అలా హీరోలు తమ అభిమానులకు కొన్ని సూచనలు చేసేందుకు తోడ్పడుతోంది సోషల్‌ మీడియా. అసలు మ్యాటర్‌ ఏంటంటే, తాజాగా లారెన్స్‌ రాఘవ 'కాంచన 3' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. బీసీ సెంటర్స్‌లో లారెన్స్‌కి విపరీతమైన ఆదరణ ఉంది. ఆ ఆదరణతోనే ఈ సినిమా సక్సెస్‌ దిశగా పరుగులు పెడుతోంది. మాస్‌ పల్స్‌ బాగా తెలిసినోడు లారెన్స్‌. ఇదిలా ఉంటే, తాజాగా ఓ అభిమాని క్రేన్‌కి వేలాడుతూ, లారెన్స్‌ కటౌట్‌కి పాలాభిషేకం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌ అవుతూ లారెన్స్‌ని చేరింది. 

 

ఈ వీడియోపై లారెన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'నాపై అభిమానం చూపేందుకు ఇలాంటి సాహసాలు చేయొద్దు.. మీరిలాంటి సాహసాలు చేసే ముందు మీ కుటుంబ సభ్యుల్ని గుర్తు చేసుకోండి. అంతగా నాపై అభిమానం చాటుకోవాలంటే, తిండి లేక బాధపడుతున్న వృద్ధులకు అన్నం పెట్టించండి. బడికి వెళ్లి చదువుకోలేని పిల్లలకు చదువు చెప్పించండి. అంతేకానీ ఇలా కోరి మీ ప్రాణాలు గాల్లో వేలాడదీయకండి..' అని అభిమానులకు స్వీట్‌గా వార్నింగ్‌ ఇచ్చాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS