ఈవారం నాని జెర్సీ సినిమాతో పోటీ పడి వచ్చిన డబ్బింగ్ బొమ్మ 'కాంచన 3'. లారెన్స్‌కి మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా కాంచన సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడాయి. దాంతో... ఈ సినిమాకీ టాక్‌తో సంబంధం లేకుండా అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. చాలా ఏరియాల్లో 'జెర్సీ'తో పోటీ పడి మరీ వసూళ్లు దక్కించుకుంటోంది. తొలి మూడు రోజుల్లో 'జెర్సీ' దాదాపు 11 కోట్లు సాధిస్తే.. కాంచన 9 కోట్లు రాబట్టింది. లారెన్స్ కెరీర్‌లో ఇదో రికార్డు.
ఈ మధ్య వచ్చిన డబ్బింగ్ సినిమాలతో పోలిస్తే... కాంచన బాక్సాఫీసు పరంగా హిట్టయినట్టే లెక్క. ఏ సెంటర్లలో నాని సినిమా హవా చూపిస్తోంటే, బీ,సీలలో కాంచన జోరు కనిపిస్తోంది. నైజాంలో తొలి మూడు రోజులకు దాదాపుగా 3 కోట్లు కొల్లగొట్టింది కాంచన. సీడెడ్‌లో రూ.2 కోట్లు వచ్చాయి. ఈస్ట్, వెస్ట్ కలిపి 1.45 కోట్లు తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలో రూ.16 కోట్ల బిజినెస్ చేసుకున్న ఈ సినిమా.. ఆ డబ్బులు రాబట్టుకొనే దిశగానే అడుగులేస్తోంది.