గత సీజన్స్‌లో ఎప్పుడూ జరగని విధంగా ఈ సీజన్లో ఓ వింత పరిణామం జరిగింది. అదే ఫేక్ ఎలిమినేషన్. రాహుల్ సిప్లిగంజ్ని ఓ వారం ఫేక్ ఎలిమినేట్ చేశారు. ఒక రోజంతా సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. హౌస్ మేట్స్ తన పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు.. ఏం మాట్లాడుకుంటున్నారు.. అనేదంతా సీక్రెట్‌గా రాహుల్ వినేలా చేశారు. ఇంతవరకూ జరగని కొత్త పరిణామమిది. అలా ఒక రోజంతా సీక్రెట్ రూమ్‌లో ఉంచిన రాహుల్‌ని తిరిగి హౌస్‌లోకి ప్రవేశ పెట్టారు. రీ ఎంట్రీ ఇచ్చిన రాహుల్‌లో కంప్లీట్ ఛేంజ్ కనిపించింది. అంతకు ముందు వరకూ హౌస్‌లో రాహుల్ పర్ఫామెన్స్ వేరు. ఆ తర్వాత పూర్తిగా వేరు. గేమ్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు.
అయితే, ఫేక్ ఎలిమినేట్ అయిన రాహుల్‌కి గేమ్ విన్నర్ తానే అని ముందే తెలిసిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హోస్ట్ నాగార్జున, 'రాహుల్ నువ్వే విన్నర్‌వి' అని ముందే చెప్పేశాడంటూ ఓ సందర్భంలో హౌస్‌లో డిస్కషన్ జరిగింది. శివజ్యోతి, శ్రీముఖికి చెప్పిందని, శ్రీముఖి బాబా భాస్కర్ వద్ద చెప్పింది. అయితే ఇందులో నిజమెంతో కానీ, నిజంగానే ఆ తర్వాత రాహుల్ చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. టాప్ 5కి చేరిన కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్న తర్వాత కూడా రాహుల్‌లో టెన్షన్ కనిపించలేదు. చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. అంటే రాహుల్‌కి విన్నర్ తానే అని ముందే తెలిసిపోయి ఉంటుంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాహుల్ యాంటీ ఫ్యాన్స్. అయితే, మెజార్టీ పీపుల్ బిగ్‌బాస్ టైటిల్ రాహుల్‌కి దక్కడమే యాప్ట్ అంటున్నారు.