పురాణాల్లో నారదుని పాత్రలాంటిది మన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పాత్ర. కలహ భోజనుడు అంటారు ఆయన్ని అందుకే. మన రామ్ గోపాల్ వర్మ కూడా అంతే. కాంట్రవర్సీలంటే ఆయనకు ఎంతో ఇష్టం. వాటితోనే కడుపు నింపుకుంటారనడం అతిశయోక్తి అనిపించినా, ఆయన ఏం చేసినా పబ్లిసిటీ కోసమేనండోయ్. నారుదునిలా భుక్తి నింపుకునే టైప్ కాదాయన. నారదుడు కలహ భోజనుడు అయితే, మన వర్మగారు పబ్లిసిటీ ప్రియుడు అంతే. తాజాగా మరోసారి 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా రూపంలో వర్మ గారి నుండి ఓ పెద్ద కాంట్రవర్సీ సిద్ధమైంది. అదే ఆయన తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది.
వర్మ గారి నుండి ఏ సినిమా వచ్చినా, అది ఖచ్చితంగా కాంట్రవర్సీ కావల్సిందే. తర్వారా ఆయన కోరుకున్నంత టన్నుల కొద్దీ పబ్లిసిటీ రావల్సిందే. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు వగైరా అన్నీ చూసేశాం. ఆల్రెడీ సినిమా ఎలా ఉండబోతోందో అర్ధమైపోయే ఉంటుంది. చంద్రబాబు రాజ్యంలోకి, జగన్ రావడమే సినిమా కథ. కథ ఎలా నడవబోతుందో ట్రైలర్ ద్వారా చెప్పేసి, అంచనాలు పెంచేశారు.
ఇక ఆయన కోరుకున్న కాంట్రవర్సీయల్లా, ఆందోళనలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దగ్ధం రూపంలో ముందు ముందు జరగనుంది. అది తలచుకుంటేనే వర్మగారికి ఆనందం తన్నుకొస్తోందట. నిజానికి రిలీజ్‌కి ముందు కాంట్రవర్సీలు ఎక్కడ జరుగుతాయో అని ఇంకెవరైనా అయితే, టెన్షన్‌తో తలలు పట్టుకుంటారు. కానీ, పబ్లిసిటీ కోసం అస్సలేమాత్రం మొహమాటపడని వర్మగారు మాత్రం ఇదిగో ఇలా ఆనందంతో ఊగిపోతుంటారు. అంతే వర్మ రూటే సెపరేటు.