స్నేహితులతో పబ్‌కి వెళ్లిన బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కొందరు వ్యక్తులు బీరు బాటిల్స్‌తో దాడి చేసిన సంగతి తెలిసిందే. పబ్‌లో దాడి తర్వాత, ముందుగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందిన రాహుల్ సిప్లిగంజ్, ఘటన నుండి తేరుకున్నాక పోలీసులను ఆశ్రయించారు. పబ్‌లో జరిగిన సంఘటనను పోలీసులకు వివరిస్తూ సదరు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. అయితే, దాడి జరిగిన వెంటనే రాహుల్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ప్రచారం జరిగింది. అందుకు కారణాల్ని రాహుల్ మీడియా ముఖంగా వివరించారు.
అసలు తనపై దాడి చేసిన వ్యక్తులు ఎవరు.? వారి వివరాలు ఏంటనేది తెలుసుకోవాలన్న ఇంటెన్షన్‌తో ఉన్నాననీ, దాడి చేసిన వ్యక్తులు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారని తెలియడంతో సీసీ ఫుటేజ్‌ని తారుమారు చేస్తారేమో అని భయపడ్డాననీ, పొలిటికల్ పవర్‌తో కేసును ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారనీ.. కాస్త ఆలోచించానని రాహుల్ చెప్పాడు. కానీ, ఓ సామాన్య వ్యక్తినైన నన్ను బిగ్‌బాస్ షో ద్వారా చాలా మంది అమితంగా ఆదరించారు.. విన్నర్‌గా నిలబెట్టారు. అలాంటిది, ఈ ఘటనపై తాను బయటికి రాకుంటే, జనం తనను చిన్నచూపు చూస్తారనీ, తనకు గవర్నమెంట్‌పైనా, చట్టం పైనా నమ్మకం ఉందనీ, ఈ కేసులో ఉన్నవాళ్లు ఎంత పెద్ద వాళ్లు అయినా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తాననీ రాహుల్ తెలిపారు. మొదట్లో లైట్ తీసుకున్న ఈ ఇష్యూ, రాహుల్ మీడియా ముందుకు రావడంతో కీలక మలుపు తిరిగింది . చూడాలి మరి ఇప్పుడు ఎంత దూరం పోతుందో .