అయ్యో రాజ్‌తరుణ్‌ ఆ రీమేక్‌ మిస్సయ్యాడా?

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌, ఇటీవల నేషనల్‌ అవార్డ్‌ దక్కించుకున్న సినిమా 'అంధాదున్‌' కోసం తెలుగు యంగ్‌ హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ని దక్కించుకోవాలని పలువురు ప్రముఖ నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ రీమేక్‌ రైట్స్‌ని ప్రముఖ నిర్మాత సుధాకర్‌ రెడ్డి దక్కించుకున్నారట. యంగ్‌ హీరో నితిన్‌ తండ్రి ఈ సుధాకర్‌ రెడ్డి, తన కుమారుడు నితిన్‌ కోసం ఈ రీమేక్‌ రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

ఇంతవరకూ ఈ రీమేక్‌లో మరో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ నటించనున్నాడని ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్‌ నితిన్‌ చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో పాత్ర అంధుడి పాత్ర అని తెలిసిన సంగతే. ఆల్రెడీ 'అంధుడు'గా రాజ్‌తరుణ్‌ ఓ సినిమాలో నటించేశాడు. ఒకవేళ నితిన్‌ నటిస్తే, నితిన్‌కి ఖచ్చితంగా ఇది ఛాలెంజింగ్‌ రోల్‌ అవుతుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

 

రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తెలుగు వెర్షన్‌ కోసం హీరోయిన్‌గా ఏ ముద్దుగుమ్మని ఎంచుకుంటారో చూడాలి మరి. అలాగే, డైరెక్టర్‌ ఇతర టెక్నీషియన్ల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు నితిన్‌ ప్రస్తుతం 'భీష్మ' సినిమాతో బిజీగా ఉన్నాడు. తర్వాత 'రంగ్‌దే' చిత్రలో నటించనున్నాడు. ఈ రెండూ పూర్తి చేసుకుని, అన్నీ కుదిరితే, 'అంధాదున్‌' రీమేక్‌ కోసం కసరత్తులు చేయాల్సి ఉంటుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS