అతిలోకసుందరి శ్రీదేవి మరణించి దాదాపు నెలరోజులు కావోస్తున్నా ఆమె మరణం పైన ఏదో ఒక చోట నుండి ఏవో ఒక కామెంట్స్ వినపడుతూనే ఉన్నాయి.
నిన్న ఉగాది సందర్భంగా ఒక పంచాగ కర్త మాట్లాడుతూ- శ్రీదేవిది సహజ మరణం కాదు హత్య అని చెప్పడం వివాదాస్పదమైంది. అది చల్లబడక ముందే మహారాష్ట్రకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు రాజ్ ఠాక్రే చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే, రాజ్ ఠాక్రే ఒక మీటింగ్ లో మాట్లాడుతూ- “నటి శ్రీదేవికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయడమేంటి? ఆమె దేశానికి చేసిన సేవ ఏంటి? ఆమె గొప్ప నటి అయి ఉండవచ్చు. కాని ఇలా దేశానికి ఏమి చేయని వారికి ఇలా ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయడం సరి కాదు” అని అభిప్రాయపడ్డారు.
దీనితో శ్రీదేవి మరణం మళ్ళీ ఒకసారి వార్తలోకేక్కింది.