యంగ్ హీరో రాజ్ తరుణ్ దూకుడు పెంచాడు. ఇటీవలే 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'అంధగాడు' సినిమాలతో అలరించాడు. 'రాజుగాడు' సినిమాతో త్వరలోనే రానున్నాడు. తాజాగా మరో సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. అనీష్ కృష్ణ డైరెక్టర్‌గా రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. 'అలా ఎలా' సినిమాతో డైరెక్టర్ అనీష్ కృష్ణ సుపరిచితుడే. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోందీ సినిమా. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హరీష్ శంకర్ తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. 'లవర్' టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గాయత్రీ సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు సినిమాలంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడియన్స్‌లో. హీరో విషయమున్నోడు అయితే ఇక ఆ సినిమాపై అంచనాలు అలా ఇలా ఉండవు. యంగ్ హీరో రాజ్‌తరుణ్ అంటే ఎనర్జీకి పెట్టింది పేరు. అదే హీరోగా మనోడ్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. తొలి సినిమా 'ఉయ్యాలా జంపాలా' నుండీ రాజ్‌తరుణ్ డిఫరెంట్‌గా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. అలాంటి రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్ అంటే సమ్దింగ్ ఎట్రాక్టివ్ కాన్సెప్టే అనుకోవాలి. 'కిట్టుగాడు'గా కుక్కల దొంగతనం చేసి, థ్రిల్ ఇచ్చాడు. 'అంధగాడు'గా నటించి, అదరహో అనిపించాడు. మరి కొద్ది రోజుల్లోనే 'రాజుగాడు'గా రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. హీరోయిన్ జేబులోంచి పర్స్ కొట్టేసే ఆ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజా సినిమాతో మనోడు 'లవర్'గా అవతారమెత్తనున్నాడన్న మాట.