75 మిలియన్‌ డాలర్ల విజువల్‌ వండర్‌.!

By iQlikMovies - September 10, 2018 - 16:59 PM IST

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న విజువల్‌ వండర్‌ మూవీ 'రోబో 2.0' చిత్రం ఎప్పటినుండో అభిమానుల్ని ఊరిస్తోంది. షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యి చాలా కాలమే అయినా, కానీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కారణంగా ఈ సినిమా నిర్మాణం లేటవుతూ వస్తోంది. ఇదిగో విడుదల, అదిగో విడుదల అంటూ వాయిదాల మీద వాయిదాల పడుతూ విసిగిస్తోంది. అయినా కానీ సూపర్‌స్టార్‌కున్న క్రేజ్‌తో ఈ సినిమాపై ఆశక్తి ఏమాత్రం తగ్గడం లేదు. 

ఇకపోతే ఇప్పుడిప్పుడే సినిమాకి సంబంధించి తాజా అప్‌డేట్స్‌ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అంటే ప్రమోషన్స్‌ జోరందుకున్నాయనే చెప్పాలి. ఆదివారం అక్షయ్‌కుమార్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన గెటప్‌ని రిలీజ్‌ చేశారు. ఈ నెల 13న టీజర్‌ రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 75 మిలియన్‌ డాలర్ల విజువల్‌ వండర్‌ 'రోబో 2.0' అంటూ సినిమాని సరికొత్తగా ప్రమోట్‌ చేస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌ని ఈ సినిమా కోసం ఖర్చు చేశారట. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఓ విజువల్‌ అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 3000 మంది టెక్నీషియన్లతో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్‌ కూడా ఓ పెను సంచలనమే కానుంది. కనీ వినీ ఎరుగని స్థాయిలో ఇంతకు ముందెన్నడూ ఏ ఇండియన్‌ సినిమాకి జరగనంత ఘనంగా, వైభవంగా రోబో ఆడియో ఫంక్షన్‌ని దుబాయ్‌లో నిర్వహించిన సంగతి కూడా విదితమే. 

ఇక సినిమా ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌ నటి అమీజాక్సన్‌, సూపర్‌స్టార్‌తో జత కడుతోంది ఈ సినిమాలో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS