ఇదంతా జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే అంటోన్న రజనీ.!

మరిన్ని వార్తలు

2.0' సినిమా:

'బాహుబలి'ని కొట్టేది 'రోబో 2.0' సినిమానేనా.? విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా, వసూళ్ల పరంగా రికార్డుల పరంగా ఇంతవరకూ 'బాహుబలి'ని బీట్‌ చేసిన సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అయితే 'రోబో 2.0' ఆ రికార్డుల్ని బ్రేక్‌ చేస్తుందని అంటున్నారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న రోబో 2.0 కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది. ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా వేగవంతం చేశారు. మరోవైపు ఈ సినిమాకి సరైన ప్రమోషన్స్‌ జరగడం లేదన్న వాదనకు సూపర్‌స్టార్‌ డైరెక్టుగా క్లారిటీ ఇచ్చేశారు.

 

వన్స్‌ సినిమా రిలీజయ్యాక చూసిన ప్రతీ ఒక్కరూ ఈ సినిమాకి ప్రమోషన్స్‌ నిర్వహిస్తారని స్వయంగా రజనీకాంతే చెప్పేశారు. లేటెస్టుగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో రజనీ చేసిన వ్యాఖ్యలు ఆశక్తికరంగా నిలిచాయి. తెలుగు వాళ్లు చాలా మంచోళ్లు. తెలుగమ్మాయిలు చాలా చాలా టాలెంటెడ్‌, తెలుగు భోజనం ప్రపంచ ప్రసిద్ధి.. అంటూ ఇలా తెలుగు వాళ్లను పొగడ్తలతో ముంచెత్తేశారు. అంటే 'రోబో 2.0' తెలుగు వెర్షన్‌పై రజీనీకాంత్‌ చాలా ఆశలు పెట్టుకున్నట్లే కనిపిస్తోంది.

 

ఇకపోతే ప్రమోషన్స్‌లో భాగంగా ఇంతవరకూ బయటికి వదిలిన ప్రోమోస్‌, టీజర్స్‌, ట్రైలర్స్‌ ఇవన్నీ జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే. అంతకు మించిన బ్రహ్మాండాన్ని సినిమాలో చూడబోతున్నారనీ రజనీకాంత్‌ చెప్పారు. అక్షయ్‌కుమార్‌ కీలకపాత్ర పోషించిన ఈ సినిమాలో అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'రోబో 2.0' లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో సుభాస్‌ కరణ్‌ నిర్మించారు. నవంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS