సూపర్ స్టార్ రజినీకాంత్ ని దర్శకత్వం చేయడం అనేది దాదాపు ప్రతి దర్శకుడికి ఉండే కోరిక. అయితే అటువంటి కోరికని ఒక యువ దర్శకుడు తన కెరీర్ తొలి నాళ్ళలోనే దక్కించుకున్నాడు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మధ్యనే సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసి ఒక కథ చెప్పడం అది సూపర్ స్టార్ కి తెగ నచ్చడంతో వెంటనే ఆ కథకి గ్రీన్ సిగ్నల్ దొరికిందట. ఇక ఈ చిత్రాన్ని సన్ నెట్వర్క్ అధినేత అయిన కళానిధి మారన్ నిర్మించనున్నాడు.
గతంలో ఈయననే రజిని-శంకర్ కలయికలో వచ్చిన రోబో చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇక ఇంతటి గొప్ప అవకాశాన్ని తనకి అందించిన రజినీకాంత్ కి తన జీవితాంతం రుణపడి ఉంటాను అని దర్శకుడు కార్తీక్ తన ఆనందాన్ని తెలియచేశాడు.
ఈ సంచలన దర్శకుడు తలైవాని ఎలా చూపించానున్నడో అన్న ఆసక్త అందరిలోనూ ఇప్పటినుండే మొదలైంది.