ఈ మధ్య 'మ్యాగ్జిమ్' కవర్ పేజ్ కోసం రకుల్ విచ్చల విడిగా అందాల ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోల్లో రకుల్‌ని చూసి మొదట అంతా షాకయ్యారు. అయితే ఆ తర్వాత లైట్ తీసుకున్నారు. రకుల్‌కి ఇదేం కొత్త కాదులే అనుకున్న వాళ్లు కొందరైతే, బాలీవుడ్‌కి వెళ్లాక అందాల డోస్ మరీ పెంచేసిందే అనుకుని సరిపెట్టుకున్న వాళ్లు ఇంకొందరూ ఉన్నారు. అయితే ఈ అందాల ఆరబోతపై రకుల్ తాజాగా స్పందించింది.
నన్ను అలా చూసిన వాళ్లంతా షాకయిన మాట నిజమే కానీ, కవర్ పేజ్‌పై అందంగా మెరిసిపోవాలనీ ప్రతీ హీరోయిన్‌కీ ఉంటుంది. ఆ కల నెరవేరేే టైం నాకు ఇన్నాళ్లకు వచ్చింది అంటూనే నా ఫిజిక్ చాలా బాగుంటుంది. ఏ కాస్ట్యూమ్ వేసినా సరిగ్గా సరిపోతుంది. ఇక సినీ రంగంలో ఉన్నప్పుడు ఎక్స్పోజింగ్ అనేది చాలా చిన్న విషయం. అలాంటప్పుడు ఓ హీరోయిన్గా నేను హాట్‌నెస్‌ని పండించడంలో తప్పేముందని చాలా సింపుల్‌గా చెప్పేసింది. అంతటితో ఆగలేదు ఈ ముద్దుగుమ్మ.
ఇంకో సీక్రెట్ కూడా చెప్పింది. అదే 'కాస్టింగ్ కౌచ్'. ఈ విషయంలో తననెవరూ ఇబ్బంది పెట్టలేదనీ, అలాంటి అనుభవాన్ని తాను ఎప్పుడూ ఎదుర్కోలేదనీ, తన టాలెంట్‌తోనే ఈ స్థాయికి ఎదిగాననీ అంటోందీ ముద్దుగుమ్మ. ఏ రంగంలోనైనా సరే టాలెంటే ముఖ్యం అని రకుల్ ఫిలాసఫీ చెబుతోంది. నమ్మాలి కదా మరి. ఇకపోతే ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ నుండి స్మాల్ బ్రేక్ తీసుకుంది.
బాలీవుడ్లో రకుల్ నటించిన 'అయ్యారీ' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పక్క తమిళంలోనూ బిజీగానే ఉంది. సూర్య, కార్తిలతో రెండు సినిమాల్లో నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.