అక్కినేని మేనల్లుడు సుమంత్ నయా యాంగిల్ ట్రై చేస్తున్నాడట. అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సుమంత్ కనిపించబోతున్నాడనీ సమాచారమ్. ఇటీవల 'మళ్లీ రావా' చిత్రంతో లాంగ్ గ్యాప్ తర్వాత సుమంత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడనే చెప్పాలి. కొంచెం కొత్తగా అంటూ 'నరుడా డోనరుడా' సినిమాతో ప్రయోగం చేసి బోల్తా కొట్టాడు. దాంతో తర్వాత రెగ్యులర్ లవ్ స్టోరీ అయిన 'మళ్లీ రావా' చిత్రంతో కాస్త తేరుకున్నాడు.
ఈ ఊపులోనే కొన్ని కొత్త కొత్త కథలు విన్నాడట. అందులో భాగంగా తెరకెక్కుతోన్న చిత్రం ఒకటి ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే, ఇదో థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. ఫోటో జర్నలిస్టు పాత్రలో సుమంత్ కనిపించబోతున్నాడట ఈ సినిమాలో. ఈ పాత్ర కొంచెం నెగిటివ్ షేడ్స్‌తో కూడుకున్నదనీ సమాచారమ్. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ, థ్రిల్లింగ్ టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారట. హీరోగా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించగల సత్తా ఉన్నోడో సుమంత్.
అయితే టైం కలిసి రావడం లేదు. కెరీర్లో 'గోదావరి' తదితర హిట్ చిత్రాలున్నప్పటికీ, ప్రస్తుతం సుమంత్ కెరీర్ స్లోగానే ఉందని చెప్పాలి. ఒకానొక టైంలో నటనకు గుడ్‌బై చెప్పేసి, నిర్మాణ రంగం వైపు దృష్టి పెట్టాలనుకున్నాడు సుమంత్. కానీ నటనపై ఉన్న ఆశక్తితో ఆ ఆలోచనను విరమించుకుని, మంచి హిట్ కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మరి ఈ సారైనా కొత్త యాంగిల్ సుమంత్‌కి వర్కవుట్ అవుతుందేమో చూడాలిక.
'ప్రేమమ్' ఫేం అంజు కురియన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అనిల్ శ్రీ కంఠం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వేసవిలో ఈ సినిమాని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.