'పోకిరి రాజా'తో స్టెప్పులేయనున్న సన్నీలియోన్‌.!

By iQlikMovies - January 18, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

మలయాళంలో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన 'పోకిరిరాజా' సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌ తెరకెక్కుతోంది. మలయాళ స్టార్‌ హీరో ముమ్ముట్టి ఈ సినిమాలో హీరోగా నటించారు. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌ రూపొందించడం ఆనందంగా ఉందని డైరెక్టర్‌ వైశాఖ్‌ అన్నారు. మోహన్‌లాల్‌తో ఇటీవల 'మన్యంపులి' చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయం అందుకున్నాడీ డైరెక్టర్‌.

 

కాగా తాజా చిత్రం విషయానికి వస్తే, ఈ సినిమాలో ముమ్ముట్టి సరసన ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ సన్నీలియోన్‌ని తీసుకురానున్నారట. ముమ్ముట్టి స్టార్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. అది ఇప్పటికి కుదిరిందని సన్నీలియోన్‌ మురిసిపోతోంది. ఆల్రెడీ సన్నీలియోన్‌ సౌత్‌లో పలు ఐటెం సాంగ్స్‌తో మురిపించింది.

 

సన్నీలియోన్‌ లీడ్‌ రోల్‌లో 'వీరమహాదేవి' అనే పీరియాడిక్‌ మూవీ తెరకెక్కుతోన్న సంగతి విదితమే. ఇదే కాక మరిన్ని సౌత్‌ సినిమాలకు సైన్‌ చేస్తోంది హాట్‌ హాట్‌ సన్నీలియోన్‌. ఇక ముమ్ముట్టి ప్రధాన పాత్రలో తెలుగులో 'యాత్ర' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా ఈ 'యాత్ర' రూపొందుతోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS