రకుల్‌, కార్తీ కెమిస్ట్రీ అదిరిందిగానీ.!

మరిన్ని వార్తలు

అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తమిళ హీరో కార్తీ నటిస్తోన్న కొత్త సినిమా తాలూకు స్టిల్స్‌ బయటకు వచ్చాయి. ఈ సినిమాలో కార్తీ 'దేవ్‌' పాత్రలో కన్పించబోతున్నాడు. ఇంతకు ముందు కార్తీ - రకుల్‌ కలిసి ఓ సినిమాలో నటించారు. 'ఖాకీ' సినిమా అది. 

అందులో రకుల్‌ పాత్రని, సినిమా విడుదలయ్యాక కత్తిరించేశారు. ఆ మాటకొస్తే, ఆమెకు ఆ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రే దక్కింది. సినిమా గమనానికి అడ్డం వస్తుందని, ఆ కొద్ది పాత్రనీ పీకి పారేశారు. దాంతో రకుల్‌ బాగా అప్‌సెట్‌ అయ్యిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే ఇంకోసారి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ఈ సినిమాలో అయినా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి అంత సీన్‌ వుంటుందా.? లేదా.? అన్న అనుమానాలు కలగడం సహజమే. 

అయితే సినిమా స్టిల్స్‌ చూస్తోంటే మాత్రం ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అదిరిపోయినట్లే కన్పిస్తోంది. రకుల్‌ కూడా మునుపటి కంటే క్యూట్‌గా కన్పిస్తోంది. ఈ సినిమా కోసం రకుల్‌ ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టిందట. ఈ మధ్య రకుల్‌ కెరీర్‌ సౌత్‌లో ఏమంత గొప్పగా నడవడంలేదు. దాంతో కార్తీ సినిమా సూపర్‌ హిట్‌ అయితే మళ్ళీ తన కెరీర్‌ జోరందుకుంటుందని రకుల్‌ భావిస్తోంది. 

కార్తీ విషయానికొస్తే, 'దేవ్‌'గా కార్తీ డిఫరెంట్‌ లుక్‌తో కనిపిస్తున్నాడు. రకుల్‌తో ఆల్రెడీ 'ఖాకీ'లో రొమాన్స్‌ (ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సీన్స్‌ తక్కువే అయినా) అదరగొట్టేశాడు. ఇంకోసారి ఈ ఇద్దరి ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ అదిరిపోతుందని స్టిల్స్‌ చూసినవారంతా డిసైడ్‌ అయిపోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS