'ఇండియన్‌ 2'లో 'అవంతికా': నిజమేనా?

మరిన్ని వార్తలు

ఇటీవల 'అవంతిక'గా రకుల్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆమె నటిస్తున్న 'మన్మధుడు 2'లో రకుల్‌ పాత్ర పేరు అవంతికా. ఈ పాత్రను ఇంట్రడ్యూస్‌ చేస్తూ వదిలిన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ రావడంతో పాటు, కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఈ సంగతి పక్కన పెడితే, తాజాగా మన అవంతికకు ఓ బంపర్‌ ఛాన్స్‌ తగలిందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటా? బంపర్‌ ఛాన్స్‌ అంటే, విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ సినిమాలో రకుల్‌ ఛాన్స్‌ దక్కించుకుందట.

 

కమల్‌ హాసన్‌ నటిస్తున్న 'ఇండియన్‌ 2'లో రకుల్‌కి అవకాశం దక్కిందట. ఆల్రెడీ ఈ సినిమాలో చందమామ కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలో ఒకే హీరోయిన్‌ కాదు. మరో ఇద్దరు భామలకీ ఈ సినిమాలో చోటుంది. అలా కాజల్‌తో పాటు టోటల్‌గా ముగ్గురు భామలు 'ఇండియన్‌ 2'లో ఆల్రెడీ హీరోయిన్లుగా చోటు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు రకుల్‌ కూడా ఓ ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ కోసం ఈ సినిమాలో భాగం కాబోతోందనీ తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే రకుల్‌కిది బంపర్‌ ఆఫరే అని చెప్పక తప్పదు. తమిళంలో రకుల్‌ ప్రీత్‌ యంగ్‌ హీరో శివకార్తికేయన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు, ప్రచారంలో ఉన్నట్లు ఈ తాజా ఆఫర్‌ కూడా నిజమే అయితే, రకుల్‌ దశ తిరిగినట్లే. ఇదంతా మన్మధుడి హ్యాండ్‌ పవరేనేమో.

 

తెలుగులో 'మన్మధుడు 2'లో నటించే ఛాన్స్‌ దక్కించుకున్నాకే, రకుల్‌కి మళ్లీ తన ఉనికిని చాటుకునే అవకాశం దక్కింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉండబోతోందనీ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ ద్వారా అర్ధమైంది. ఇక ఈ సినిమా హిట్‌ అయ్యిందంటే రకుల్‌ పోగొట్టుకున్న స్టార్‌డమ్‌ మళ్లీ దక్కించుకున్నట్లే. ఈ సినిమా ఆగస్ట్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. సమంత గెస్ట్‌ రోల్‌ పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS