టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. అందుకనేనేమో.. మిగిలినవాళ్ల మనసులూ పెళ్లి వైపుకి లాగుతున్నాయి. తాజాగా... రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్లి కబుర్లు ఏకరువు పెట్టింది. తనకు పెళ్లిపై గౌరవం, నమ్మకం ఉన్నాయని, భారతీయ వివాహ వ్యవస్థ చాలా విశిష్టమైనదని, ఏదో ఓ రోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది.
``నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చా. కాబట్టి.. నాకు కాబోయే వరకూ అలాంటి కుటుంబం నుంచి రావాలి. పెద్దలపై గౌరవం ఉండాలి. జీవితంపై ఓ ప్రత్యేకమైన అవగాహన, అభిరుచి కనిపించాలి. జీవన సరళి చాలా పద్ధతిగా ఉండాలి. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా. ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. నాకూ అదే ఇష్టం. మా పెళ్లి బీచ్ లో జరగాలని కోరుకుంటున్నా. ప్రస్తుతానికైతే నా ప్లానింగ్స్ ఇంతే..`` అని చెప్పుకొచ్చింది.