సన్నీలియోన్‌ సౌత్‌లో ఫిక్సయినట్లేనా.?

By iQlikMovies - December 31, 2018 - 15:05 PM IST

మరిన్ని వార్తలు

పోర్న్‌ రంగం నుండి వచ్చి బాలీవుడ్‌లో ఐటెంగాళ్‌గా, హీరోయిన్‌గా బోలెడంత క్రేజ్‌ సంపాదించిన హాట్‌ భామ సన్నీలియోన్‌. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నప్పుడే సన్నీలియోన్‌కి సౌత్‌లో కూడా క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌తోనే ఈ మధ్య సౌత్‌లో అడుగు పెట్టింది. మొదట ఐటెం సాంగ్స్‌తో ఆకట్టుకున్న సన్నీలియోన్‌ ప్రయాణం ఇప్పుడు హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తో జోరుగా సాగుతోంది. 

 

మంచు మనోజ్‌ నటించిన 'కరెంట్‌ తీగ' సినిమాతో సన్నీలియోన్‌ తెలుగులో తెరంగేట్రం చేసింది. ఆ సినిమాలో సన్నీలియోన్‌ ఐటెం సాంగ్‌తో పాటు, గెస్ట్‌ రోల్‌ కూడా పోషించింది. అయితే సన్నీకి మంచి పేరు తీసుకొచ్చిన మూవీ 'గరుడవేగ'. ఈ సినిమాలోని 'డియ్యో డియ్యో..' స్పెషల్‌ సాంగ్‌ సన్నీలియోన్‌ పేరు తెలుగులో మార్మోగిపోయేలా చేసింది. సినిమా సక్సెస్‌ అవడంతో ఆ సాంగ్‌ బాగా పాపులర్‌ అయ్యింది. ఇకపోతే తాజాగా సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో 'వీర మహాదేవి' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 

 

లేటెస్టుగా సన్నీలియోన్‌ మలయాళంలో 'రంగీలా' అనే సినిమాలో నటించేందుకు ఒప్పుకుందనీ తెలుస్తోంది. ఇది కూడా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీనే కావడం విశేషం. ఇదిలా ఉంటే, మలయాళ సూపర్‌ స్టార్‌ ముమ్ముట్టి హీరోగా రూపొందుతోన్న 'మధుర రాజా' అనే చిత్రంలో సన్నీలియోన్‌ స్పెషల్‌ సాంగ్‌లో నర్తించనుందట. ఆల్రెడీ తమిళంలో నటించిన సన్నీలియోన్‌ బాలీవుడ్‌ని పక్కన పెట్టేసి, ఇక సౌత్‌లో ఫిక్సయినట్లే అనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS