ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుండీ యంగ్ హీరో, స్టార్ హీరో అనే తేడా లేకుండా అందరితోనూ కలిసి నటిస్తోన్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్‌సింగ్. ఒక్కసారి స్టార్‌డమ్ దక్కితే చాలు ఇక యంగ్‌హీరోస్ వైపు కన్నెత్తి కూడా చూడరు మన హీరోయిన్లు. కానీ ఈ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ ఆటిట్యూడ్ గొప్పది.
కథ నచ్చితే చాలు ఈ ముద్దుగుమ్మ చిన్న హీరో, పెద్ద హీరో అని ఆలోచించదు. అందుకే రకుల్ మొదట్నుంచీ అందరికీ నచ్చేస్తోంది. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఆటిట్యూడ్ అలాగే ఉంది. యంగ్ హీరోస్‌తో ఇప్పటికే చాలా మందితో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరో అయిన మహేష్‌తోనూ నటించింది ఈ మధ్య 'స్పైడర్' సినిమాలో. తాజాగా తమిళ యంగ్ హీరో కార్తీతో నటిస్తోంది. 'ఖాకీ' చిత్రంలో కార్తితో జత కడుతోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే అవకాశం వస్తే లేటెస్ట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతోనూ జత కడతానంటోంది. అదీ రకుల్ అంటే.
నిన్న కాక మొన్న టాలీవుడ్‌కి పరిచయం అయిన ముద్దుగుమ్మలు కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకీ ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది టైంలోనే పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ దక్కేసింది. అయితే ఆ ఛాన్స్ మరి స్మైలీ బ్యూటీ రకుల్‌కి ఎప్పుడు దక్కుతుందో. ఇంతవరకూ వరుస సినిమాలతో రకుల్ చాలా బిజీగా గడిపింది టాలీవుడ్‌లో. ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యింది. అయితే తమిళంలో ఆఫర్స్ ఉన్నాయి ఈ ముద్దుగుమ్మ చేతిలో. ఇప్పటికే మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్‌లతో నటించేసింది బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇక మిగిలింది పవర్‌స్టారే. పవర్ స్టార్‌తోనూ త్వరలోనే రకుల్ జత కట్టే అవకాశాలున్నాయంటోంది టాలీవుడ్. ఆ తర్వాత మెగా ప్రిన్స్, ఇక మెగాస్టార్.. రకుల్ ఖాతాలో మెగా కాంపౌండ్‌లో ఉన్న హీరోలు వీరు. చూడాలి మరి వీరితో రకుల్ ఎప్పటికి ఛాన్స్ దక్కించుకుంటుందో!