నువ్వా నేనా.? 'హాట్‌' ఛాలెంజ్‌ 'వెయిట్‌' అండ్‌ సీ!

మరిన్ని వార్తలు

'బంచిక్‌ బం బం చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా.. లేజీగా ఒళ్లు పెంచుకోక, నాజూగ్గా ఉంచు తీగలాగా..' అని అప్పుడెప్పుడో ఓ హీరోయిన్‌ రీల్‌లో చెప్పింది కానీ, ఇప్పుడీ హీరోయిన్లు మాత్రం రియల్‌ పోటీ పెట్టేసుకుంటున్నారు. నువ్వా నేనా? అంటూ వర్కవుట్స్‌ చేసేస్తున్నారు. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మలు.. అనుకుంటున్నారా? ఫిట్‌నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌, అక్కినేని కోడలు సమంత.

 

వీరిద్దరికీ యోగా, వర్కవుట్స్‌తోనే రోజు ప్రారంభమవుతుంది. ఆ సీనియర్‌ హీరోయిన్‌ చెప్పినట్లుగా అస్సలు లేజీగా ఉండరు. బాడీని నాజూగ్గా ఉంచేందుకు తెగ కష్టపడుతుంటారు. ఇప్పటికే వీళ్లు చేయని వర్కవుట్స్‌ లేవు. ఎత్తని బరువులు లేవు. ప్రొఫిషనల్‌ వెయిట్‌ లిఫ్టర్స్‌లా ఒకరిపై ఒకరు పోటీ పడి ఛాలెంజ్‌ చేసుకుని మరీ బరువులు ఎత్తేస్తున్నారు. తాజాగా వీరిద్దరి బరువు బాధ్యతల వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. హాట్‌ హాట్‌గా వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్న ఈ ముద్దుగుమ్మలను ఫ్యాన్స్‌ ఆదర్శంగా తీసుకుంటున్నారు. వారంతటిలా కాకున్నా, ఎంతో కొంత తాము కూడా ఫిట్‌గా ఉండాలనీ, బాడీని కష్టపెట్టాలనీ డిసైడ్‌ అవుతున్నారు.

 

సో అలా రకుల్‌, సమంతలు గెట్‌ ఫిట్‌ అనుకునే వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫిట్‌గా ఉంటే, ఎలాంటి రోగాలు దరి చేరవన్నది అందరికీ తెలిసిందే. కానీ, ఎంతవరకూ దాన్ని వర్కవుట్‌ చేయగలరు చెప్పండి. కానీ, ఈ వీడియోల్లో కొందరు హాట్‌ కంటెంట్‌ని ఎంజాయ్‌ చేస్తుంటే, ఇంకొందరేమో, కెపాసిటీ లేకున్నా జస్ట్‌ ఓ ట్రైల్‌ వేస్తే పోలా.. అని స్ట్రాంగ్‌గా డెసిషన్‌ తీసుకుంటున్నారు. అందుకే అంతలా ఇన్‌స్పైర్‌ చేస్తున్న రకుల్‌, సమంతలను ఈ విషయంలో అభినందించకుండా ఉండలేం. హ్యాట్సాఫ్‌ రకుల్‌ అండ్‌ సమంత.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS