గోవిందుడిపై కన్నేసిన గబ్బర్‌సింగ్‌ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు

'పెళ్లిచూపులు' సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించేశాడు. 'అర్జున్‌రెడ్డి'తోనే అద్భుతమైన అవకాశాలు కొట్టేశాడు. ఇక 'గీత గోవిందం'తో సెన్సేషన్‌కే సెన్సేషన్‌ అయిపోయాడు అర్ధమైపోయింది కదా. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ప్రత్యేకంగా చెప్పాలా? ఏంటి.? ఇప్పుడు అంతా చర్చించుకునే హీరో ఆయనే మరి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో కూడా 'గీత గోవిందం' వసూళ్ల వరద సృష్టిస్తోంది. వరదలను సైతం లెక్క చేయకుండా, ఈ సినిమా వసూళ్ల జోరు కొనసాగుతోంది. 

ఇకపోతే తాజాగా 'గబ్బర్‌సింగ్‌' సినిమాతో సెన్సేషనల్‌ విజయాన్ని అందుకున్న డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని చూశారట. సినిమా చాలా బాగుందని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారాయన. హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మికా మండన్నాని ఆకాశానికెత్తేస్తున్నారు. విజయ్‌ నటన, నడక, ఆటీట్యూడ్‌తో చంపేశాడంతే. ఇక రష్మికా ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టేసింది.. అని ఈ ఇద్దరినీ ప్రశంసలతో ముంచెత్తేశాడు.

 

ఇక అసలు విషయం ఏంటంటే, 'డీజె' తర్వాత హరీష్‌ శంకర్‌కి మరో సినిమా పడలేదు. 'డీజె'తోనే చాలా ఢీలా పడ్డాడు. నితిన్‌, శర్వానంద్‌తో 'దాగుడు మూతలు' మల్టీ స్టారర్‌ని అనౌన్స్‌ చేశాడు కానీ, అదిప్పట్లో పట్టాలెక్కేలే లేదు. మరి హరీష్‌ శంకర్‌ బుర్రలో మెదిలో ఆలోచనేంటంటే, మన సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ కోసం ఓ కొత్త స్టోరీ ప్రిపేర్‌ చేయబోతున్నాడట. ఆయన ఆటిట్యూడ్‌కి కరెక్ట్‌గా సూటబుల్‌ అయ్యే స్టోరీ ఒకటి ప్రిపేర్‌ చేయబోతున్నాడనీ తాజా సమాచారమ్‌. 

అంటే విజయ్‌ దేవరకొండతో హరీష్‌ శంకర్‌ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడా? ఏమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS