మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తాజా చిత్రం 'వినయ విధేయ రామ' సంక్రాంతి సందర్భంగా విడుదలై ఎన్ని విమర్శల్ని తన ఖాతాలో వేసుకుందో తెలిసిన సంగతే. అయితే చెప్పలేనంత నెగిటివిటీ, ఊహించని విమర్శలను తట్టుకుని ఈ సినిమా డిజాస్టర్స్‌లో హిట్ సినిమాగా నిలిచింది. ఆ డిజాస్టర్ టాక్‌తోనే వసూళ్ల రాజాలా దూసుకెళ్లిపోతున్నాడు రామ్‌చరణ్. 40 కోట్లు వసూళ్లు కొల్లగొట్టేశాడీ సినిమాతో రామ్‌చరణ్.
ఇకపోతే విమర్శల విషయానికి వస్తే, రామ్‌చరణ్‌కి అవేమీ ఇప్పుడు కొత్త కాదు. ప్రతీ సినిమాకి విమర్శల్ని ఎదుర్కొంటూనే ఉంటాడు. సూపర్ హిట్ సినిమాగా పాపులర్ అయిన 'మగధీర' సినిమా టైంలో కూడా ఇలాంటి విమర్శలు రామ్‌చరణ్‌కి తప్పలేదు. ఆ సినిమాలో ఓ పాట విషయమై చాలా చాలా వివాదాలు తలెత్తాయి. ఆ మాటకొస్తే, రామ్‌చరణ్ ప్రతీ సినిమాకీ ఓ యుద్ధమే చేస్తున్నాడు. ఆ యుద్ధంలో గెలుస్తూనే ఉన్నాడు.
అయినా రామ్‌చరణ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కథల ఎంపికలో ముందు చూపు వ్యవహరించాలి. అలాగే తనపై వస్తున్న ప్రతీ విమర్శనీ సానుకూలంగా మార్చుకోవాలి. ఇన్ని విమర్శల్ని ఎదుర్కొంటూ స్టార్‌డమ్ సొంతం చేసుకోవడమంటే మాటలు కాదు. అది నిజంగా చరణ్‌కి అదృష్టమే అని చెప్పాలి. ఆ స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోవడానికి చరణ్ మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.