ఓవర్సీస్‌లో చరణ్‌కి పెద్దగా మార్కెట్ లేదు. కానీ 'రంగస్థలం' మాత్రం అక్కడ దూకుడు ప్రదర్శిస్తోంది. ఓపెనింగ్స్‌లోనే జోరు ప్రదర్శించిందక్కడ 'రంగస్థలం'. అయితే చరణ్‌కి మార్కెట్ లేకపోయినా, సుకుమార్ సినిమాలకు అక్కడ క్రేజ్ ఉంది. అందుకే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' అక్కడ వసూళ్లు ప్రభంజనం సృష్టిస్తోంది.
ఇప్పటికే మిలియన్ మార్క్ దాటేసింది. వీకెండ్‌కి వచ్చేసరికి రెండు మిలియన్లు దాటేయనుందని అక్కడి ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సుకుమార్ క్రేజ్‌కి చరణ్ ఇమేజ్ తోడైంది. తొలిసారిగా ఓవర్సీస్‌లో చరణ్ సినిమాకి ఈ రేంజ్‌లో కలెక్షన్లు వస్తున్నాయి. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో చరణ్‌కి తిరుగే లేదు. 'రంగస్థలం' అన్ని వర్గాల వారినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏదో మిశ్రమ టాక్‌తో రన్ అవుతున్న సినిమా కాదిది. పక్కా పర్‌ఫెక్ట్ సూపర్ హిట్ టాక్ వచ్చేసింది.
ఫస్ట్ హాఫ్‌లో చరణ్ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా అయిపోతున్నారు. పల్లెటూరి కుర్రాడిలా, సౌండ్ ఇంజనీర్‌లా చరణ్ పండించిన కామెడీకి అభిమానులే కాదు, ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే రామలక్ష్మిగా సమంత పాత్రకు మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్క పాత్రకీ అదే రేంజ్‌లో పేరొస్తోంది.
మొత్తానికి 'రంగస్థలం' అంచనాలను అందుకునేలానే అనిపిస్తోంది. తొలి రోజు కలెక్షన్సే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక వీకెండ్ కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో. ఫైనల్ కలెక్షన్స్‌లో ఎంత టాప్ ర్యాంక్‌ని అందుకుంటుందో 'రంగస్థలం' చూడాలిక.