జక్కన్నా ఇంకెప్పుడు చెక్కుతావన్నా.!

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మక మల్టీ స్టారర్‌గా రూపొందుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఆల్రెడీ మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌తో బిజీగా ఉంది. ఈ షెడ్యూల్‌ కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి చేసేయనున్నాడట రాజమౌళి. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇంతవరకూ ఈ సినిమాలో హీరోయిన్స్‌ ఎవరనే విషయంపై జక్కన్న క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. దాంతో గాసిప్స్‌ మీద గాసిప్స్‌ స్పెక్యులేట్‌ అవుతున్నాయి. 

 

సహజంగానే రాజమౌళి సినిమాలపై ఎంత హైప్‌ ఉన్నప్పటికీ, హీరోయిన్స్‌ విషయంలో మాత్రం కొత్తగా ఏమీ ఆలోచించడు. అప్పటివరకూ బాగా పరిచయం ఉండీ, అంతగా పాపులారిటీ లేని ముద్దుగుమ్మల్నే తన సినిమా కోసం ఎంచుకుంటుంటాడు రాజమౌళి. ఉలి దెబ్బ పడ్డాక శిల్పానికి అందం వచ్చినట్లే, జక్కన్న సినిమాలో చేశాకే ఆ ముద్దుగుమ్మకి అంత పాపులారిటీ దక్కుతుంది. అయితే ఆ అదృష్టం మన టాలీవుడ్‌ ముద్దుగుమ్మల్లోనే ఏ ఒక్క ఇద్దరికో ఉందని తెలుస్తోంది. 

 

కానీ ప్రచారం చూస్తే బాలీవుడ్‌ రేంజ్‌లోనే సాగుతోంది. బాలీవుడ్‌ నుండి పరిణీతి చోప్రా, అలియాభట్‌ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి ఆలోచనలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ తెలియదంతే. మరోవైపు ఈ సినిమాలో ఇద్దరు కాదు, ముగ్గురు భామలకు అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS