ఉపాసన సైలెంట్‌ సర్‌ప్రైజ్‌ అదిరిందిగా.!

By iQlikMovies - September 05, 2018 - 18:15 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ట్విట్టర్‌ ద్వారా ఓ లుక్‌ రిలీజ్‌ చేసింది. 'రఫ్‌ అండ్‌ రా లుక్‌..' అంటూ చరణ్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో బ్యాక్‌ సైడ్‌ నుండి కనిపిస్తున్న లుక్‌ ఇది. చరణ్‌ - బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. అక్కడ జరగబోయే షెడ్యూల్‌కి అంతా రెడీ అయిపోయింది అంటూ ఈ లుక్‌ని రిలీజ్‌ చేసింది ఉపాసన కొణిదెల. 

దాదాపు 25 రోజుల పాటు అక్కడే భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలా ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌కి సంబంధించిన స్టిల్‌ ఇది అని భావించాలి. గతంలో 'రంగస్థలం' సినిమాకి సంబంధించి సెట్స్‌ నుండి అదిరిపోయే చరణ్‌ లుక్స్‌ని ఉపాసన ఇలాగే ట్విట్టర్‌ ద్వారా రిలీజ్‌ చేసింది. అలాగే ఇప్పుడు కూడా. ఈ లుక్‌లో చరణ్‌ని చూసి మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో బ్యాక్‌ సైడ్‌ నుండి కనిపిస్తున్నాడు ఈ లుక్‌లో చరణ్‌. 

ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోన్న తమిళ హీరో ప్రశాంత్‌, తెలుగు హీరో ఆర్యన్‌ రాజేష్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

'రంగస్థలం' బ్లాక్‌ బస్టర్‌ తర్వాత చరణ్‌ నుండి రాబోతోన్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ నుండి అతి భారీ అంచనాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS