మెగా ఫ్యామిలీలో చ‌ర‌ణ్ మిస్సింగ్‌

By Rajinikanth - January 21, 2019 - 11:03 AM IST

మరిన్ని వార్తలు

మెగా ఇంటి నుంచి మ‌రో వార‌సుడు వ‌చ్చాడు. త‌నే వైష్ణ‌వ్ తేజ్‌. సాయిధ‌ర‌మ్ తేజ్‌కి స్వ‌యానా త‌మ్ముడైన వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం మొద‌లైంది. మైత్రీ మూవీస్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బుచ్చిబాబు ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ఈరోజు ఉద‌యం రామానాయుడు స్టూడియోలో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగా ఫ్యామిలీ హీరోలు మొత్తం వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. 

 

మెగాస్టార్ చిరంజీవి, బ‌న్నీ, వ‌రుణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్‌, నాగ‌బాబు... వీళ్లంతా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. మెగా వారసుడు రామ్ చ‌ర‌ణ్ మాత్రం మిస్స‌య్యాడు. ఈరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ రెండో షెడ్యూల్ మొద‌లైంది. అందుకే చ‌ర‌ణ్ ఈ కార్య‌క్ర‌మానికి రాలేక‌పోయాడు. చిరు క్లాప్ ఇచ్చిన ఈ చిత్రానికి  అల్లు అర‌వింద్‌, అల్లు అర్జున్ స్విచ్చాన్ చేశారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS