దర్శకుడు అట్లి, తమిళ హీరో విజయ్, సౌత్ క్వీన్ నయనతార, మహానటి కీర్తిసురేష్ ఈ నలుగురి కాంబినేషన్ మూడోసారి రిపీట్ కాబోతోంది. 'రాజా రాణి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అట్లి, విజయ్‌తో 'తెరి', మెర్సల్' చిత్రాలను రూపొందించి స్టార్ డైరెక్టర్స్ రేంజ్‌కి వెళ్లిపోయాడు. విజయ్‌తో నయనతార ఆల్రెడీ 'విల్లు', 'శివకాశి' చిత్రాల్లో కలిసి నటించారు. ఇక 'మహానటి'తో తెలుగులోనూ, తమిళంలోనూ కూడా స్టార్ హీరోయిన్ హోదాని దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తిసురేష్ కూడా విజయ్‌తో రెండు సార్లు స్క్రీన్ షేర్ చేసేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో 'భైరవ', 'సర్కార్' సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.
ఇప్పుడు ఈ నలుగురూ కలిసి ఒకేసారి బ్లాక్ బస్టర్ అందుకునేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ హీరోగా అట్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో నయనతారను ఆల్రెడీ హీరోయిన్గా ఎంచుకున్నారు. కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారమ్. అలా ఈ నలుగురికీ ఈ ప్రాజెక్ట్ ముచ్చటగా మూడో నెంబర్ కానుంది. ఇకపోతే కీర్తిసురేష్ ఇటీవల తెలుగులో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. నయనతార తమిళంలో బిజీయెస్ట్ హీరోయిన్గా కొనసాగుతూనే, తెలుగులో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'సైరా'లో మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది.