ఆ చిన్న సినిమాకి విక్టరీ వెంకటేష్‌

మరిన్ని వార్తలు

ఈ మధ్య చిన్న సినిమాల్ని స్టార్‌ హీరోలు ప్రోత్సహిస్తున్నారు. స్టార్‌ హీరోలే కాదు, స్టార్‌ డైరెక్టర్లు, నిర్మాతలు కూడా సపోర్ట్‌ చేస్తున్నారు. గతంలో కమెడియన్‌ సప్తగిరి హీరోగా పరిచయమైన మూవీ 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'ని ఏకంగా పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సపోర్ట్‌ చేశారు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌కి వెళ్లి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. అలాగే ఆ సినిమా హిట్‌ అయ్యింది. ప్రభాస్‌ కూడా పలు చిన్న చిత్రాల ఆడియో ఫంక్షన్స్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. 

 

ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వెండితెరపై హీరోలుగా పరిచయమవుతూ ఓ వెలుగు వెలగాలనుకుంటున్న కుర్రహీరోలను స్టార్‌ హీరోలు, సుకుమార్‌, రాజమౌళి వంటి దర్శకులు ఎంకరేజ్‌ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అలాగే తాజాగా విక్టరీ వెంకటేష్‌ ఓ చిన్న సినిమాకి తన సపోర్ట్‌ అందించాడు. ఈశ్వర్‌ హీరోగా పరిచయమవుతున్న '4 లెటర్స్‌' అనే మూవీ టీజర్‌, ట్రైలర్‌ చూసి యూనిట్‌ని అభినందించి, సినిమా సక్సెస్‌ కావాలని ఆశీర్వదించారు. 

 

'4 లెటర్స్‌' యూత్‌ఫుల్‌ మూవీ. ఈశ్వర్‌తో పాటు, మహారానా, అంకిత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారీ సినిమాలో. ఆర్‌ రఘురాజ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త నటీనటులతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రేమ, పెళ్లి వంటి విషయాల్లో ఈ తరం యూత్‌ ఆటిట్యూడ్‌ ఎలా ఉంటోందనే అంశాన్ని విభిన్నంగా చూపించారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS