1985 కాలం నాటికి ప్రేక్షకుల్ని తీసుకెళ్లబోతున్నాడు డైరెక్టర్ సుకుమార్. అదే 'రంగస్థలమ్' సినిమా ద్వారా. ఆ కాలం నాటి లవ్‌స్టోరీతో తెరకెక్కుతోన్న చిత్రం 'రంగస్థలమ్'. ఈ సినిమాని తెరకెక్కించడానికి ముందే ఈ స్టోరీపై సుకుమార్ చాలా కసరత్తులు చేశాడట. బోలెడంత వర్కవుట్స్ చేశాడట. అందుకు హీరోగా రామ్ చరణ్, ప్రొడ్యూసర్స్ ఇతర టెక్నికల్ టీమ్.. ఇలా అంతా సుకుమార్‌కి బాగా కో ఆపరేట్ చేశారనీ, అందువల్లే ఇలాంటి కాన్సెప్ట్‌ని తెరకెక్కించడం సాధ్యమైందనీ చెబుతున్నాడు సుకుమార్. టీమ్ అందించిన ఉత్సాహంతో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించే అవకాశం దక్కిందనీ అంటున్నాడు సుకుమార్. ఈ సినిమా కోసం చాలా చాలా సెట్స్ వేయాల్సి వచ్చిందట. ఆ సెట్స్ కూడా సెట్స్‌లా కాకుండా, చాలా నేచురల్‌గా, రియల్ లైప్‌కి దగ్గరగా ఉండేలా ఉంటాయట. దర్శకుడి సూచనల మేరకు ఆర్ట్ డైరెక్టర్ మంచి సెట్స్ వేశాడనీ అంటున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. గోదావరి అందాలు ఒక పక్క, రియాలిటీకి దగ్గరగా ఉన్న పల్లెటూరి అందాలు మరో పక్క అదిరిపోయేలా ఉండబోతోందట విజువల్‌గా 'రంగస్థలమ్'. కాలగమనంలో ముఫ్పై ఏళ్లు వెనక్కి వెళ్లడమంటే మాటలు కాదు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల నుండి, అమాంతం ఏ సాంకేతిక సదుపాయాలు లేని కాలంలోకి వెళ్లడమంటే ఊహించడం కష్టం. కానీ ఈ సినిమాలోని ఆర్టిస్టులు అది చేసి చూపించారు. ఈ సినిమాలోని అన్ని పాత్రలూ నటించినట్లుగా కాకుండా, జీవించినట్లుగా ఉంటాయట. రామ్‌చరణ్ ఓ విభిన్నమైన లుక్‌లో కనిపిస్తాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.