ఆల్రెడీ 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిన 'రంగస్థలం' సినిమా మళ్ళీ దూకుడు మొదలు పెట్టింది. గురువారం నుంచే థియేటర్లలో సందడి పీక్స్‌కి చేరిపోయింది. తొలి వారం, రెండో వారం దూకుడు కొనసాగించిన 'రంగస్థలం', బాక్సాఫీస్ వద్ద ఈ వారం కూడా అదే స్థాయిలో వసూళ్ళ పంట పండించబోతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గురువారంతో పోల్చితే, శుక్రవారం వసూళ్ళు బాగా పెరిగాయి. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మార్నింగ్ షోస్‌కి చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కన్పిస్తున్నాయి. 'ఛల్ మోహనరంగ', 'కృష్ణార్జునయుద్ధం' సినిమాలు 'రంగస్థలం' తర్వాత విడుదలైనా, అవేవీ 'రంగస్థలం' జోరుని తగ్గించలేకపోయాయి. ఓవర్సీస్‌లోనూ 'రంగస్థలం' సినిమాకి ఇంకా వసూళ్ళ పర్వం కొనసాగుతోంది. ఆల్రెడీ అక్కడ 3 మిలియన్ డాలర్ల వసూళ్ళ మార్క్‌ని దాటేసిన 'రంగస్థలం 3.5 మార్క్‌ని రీచ్ అయిపోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇండియాలో అయితే, 'బాహుబలి' తర్వాత అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ఇప్పటికే 'రంగస్థలం' రికార్డులకెక్కేసింది. తాజాగా 'రంగస్థలం' విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో పవన్‌కళ్యాణ్ సందడి చేయడంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైందని చెప్పొచ్చు. ఆ హోరులో 'రంగస్థలం' సినిమాకి ఇంకా వసూళ్ళ పంట పండొచ్చని భావిస్తున్నారు.
ఏదిఏమైనా, సైలెంట్‌గా వచ్చి వయొలెంట్ హిట్ కొట్టాడని చరణ్‌ని ఇప్పుడంతా అభినందిస్తున్నారనంటే, ఆ అభినందనలకి నూటికి నూరుపాళ్ళూ చరణ్ అర్హుడే.