'అల్లూరి సీతారామరాజు' అంటే మనకి గుర్తొచ్చేది సూపర్‌స్టార్ కృష్ణ. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన అల్లూరి సీతారామరాజు సినిమాని రీమేక్ చేయాల్సి వస్తే అది మహేష్‌తో చేయాలనుకున్నారు రాజమౌళి. కానీ మహేష్ బాబు అందుకు సపోర్ట్ చేయలేదు. ఒకానొక సందర్భంలో మహేష్ ఫ్యాన్స్ బహిరంగంగానే రాజమౌళిని అడిగేశారీ మాట. అందుకు రాజమౌళి తాను అందుకు సిద్ధంగానే ఉన్నానని చెప్పారు కూడా. అయితే మీకు జేమ్స్ బాండ్ కావాలా.? అల్లూరి సీతారామరాజు కావాలా.? అని ఫ్యాన్స్‌కి తిరుగు ప్రశ్న వేశారు.
'సీతారామరాజు' కావాలని ఫ్యాన్స్ కోరడంతో మహేష్‌తో ఆ ప్రాజెక్టు తెరకెక్కించాలనుకున్నారు. అందుకు కథ కూడా సిద్ధం చేశారు.. కానీ, మహేష్ డేట్స్ ఖాళీ లేకపోవడం, అది ఇప్పట్లో వర్కవుట్ అయ్యేలా కనిపించలేదు. దాంతో తాజాగా చరణ్‌కి 'అల్లూరి సీతారామరాజు' క్యారెక్టర్‌నిచ్చేశారు రాజమౌళి. 'ఆర్‌ఆర్‌ఆర్'లో చరణ్ యంగ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తాజాగా రాజమౌళి రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గురించి చాలా మందికి చాలా కథలు తెలుసు.
బ్రిటీష్ రూల్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేసి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన వీర యోధుడు అల్లూరి సీతారామరాజు. అయితే స్వాతంత్రోద్యమంలో పాల్గొనక ముందే ఆ పోరాటనికి అల్లూరి సీతారామరాజు ఎలా ఆకర్షితుడయ్యాడు.? ఆ వైపుగా ఆయన్ని ఇన్‌స్పైర్ చేయడానికి కారణాలేంటీ.? అనే కాన్సెప్ట్‌ని రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్'లో చూపించబోతున్నారు. అలాగే నిజాం పాలనకు అగైనెస్ట్‌గా ఫైట్ చేసిన తెలంగాణా యోధుడు యువ కొమరం భీమ్‌కి సంబంధించి కథల ద్వారా తెలియని అంశాల్ని ఎన్టీఆర్ పాత్ర ద్వారా చూపించబోతున్నారు. 1920ల నాటి కథగా రూపొందుతోన్న ఈ సినిమా 2020 జూలైలో విడుదల కానుంది.