కమెడియన్‌గా అలరిస్తోన్న సప్తగిరి హీరోగా మారి వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. మొన్నీ మధ్యనే 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' అంటూ వచ్చాడు. ఓకే అనిపించాడు ఆ సినిమాతో. తాజాగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' టైటిల్‌తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదలైంది. మంచి రెస్పాన్స్ అందుకుంది. సప్తగిరి సినిమా ఏంటి. ఆంత క్వాలిటీ ఏంటి. ఆ రిచ్‌నెస్ ఏంటి అనుకున్నవారే ఈ టీజర్ చూసినవారంతా. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ రాబోతోంది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్.
అయితే ఈ ట్రైలర్‌ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారట. అదీ ఈ సినిమా స్పెషల్. గతంలో వచ్చిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' సినిమా ఆడియో ఫంక్షన్‌కి పవర్ స్టార్ పవన్‌కళ్యాన్ ముఖ్య అతిధిగా వచ్చి, తన సపోర్ట్ అందించాడు. సినిమా చూస్తానని భరోసా ఇచ్చాడు. అలాగే ఈ తాజా సినిమాకి మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ లభించింది. ఇలా సప్తగిరి సినిమాలకి భలేగా మెగా సపోర్ట్ దక్కుతోంది.
తన పేరుతోనే సినిమా టైటిల్స్‌ని రిలీజ్ చేస్తున్నాడు సప్తగిరి. ఇది డిఫరెంట్ కదా. హీరోగా సప్తగిరి సినిమాలకి తన పేరే ది బ్రాండ్‌గా మారింది. ఇకపోతే ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే, మరో పక్క కమెడియన్‌గానూ బిజీగా గడుపుతున్నాడు సప్తగిరి. హీరో సంగతి పక్కన పెడితే, ఎప్పటిలాగే ఇతర సినిమాల్లో తన కామెడీతో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు సప్తగిరి. చూద్దాం సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి మనోడు ఎల్‌ఎల్‌బీ పట్టాని సక్సెస్‌ఫుల్‌గా అందుకుంటాడో లేదో!