`ఆర్.ఆర్.ఆర్`తో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. మరోవైపు `ఆచార్య` షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఈరెండు సినిమాలూ.. ఈ యేడాదే విడుదల కానున్నాయి. అంటే.. 2021లో చరణ్ నుంచి రెండు సినిమాలు వస్తున్నాయన్నమాట. అయితే.. ఆ తరవాత.. చరణ్ సినిమా ఎవరితో? అనేది ఇంకా సందిగ్థంలోనే ఉంది. చరణ్ తదుపరి సినిమాపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. కానీ ఆప్షన్లు మాత్రం బోలెడున్నాయి. చరణ్‌చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న దర్శకుల లిస్టు చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది.
ఛలో, భీష్మ.. సినిమాలతో ఆకట్టుకున్న వెంకీ కుడుముల, `జెర్సీ`తో తనదైన ముద్ర వేసిన గౌతమ్ తిన్ననూరి చరణ్‌కి ఇప్పటికే కథలు చెప్పేశారు. మరోవైపు... అనిల్ రావిపూడితో ఓసినిమా చేయాలని చరణ్ భావిస్తున్నాడట. ఇద్దరూ ఇప్పుడు టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. అంతేనా..? `మహర్షి` దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం చరణ్‌తో సినిమా చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. తమిళ శంకర్ కూడా... పవన్ - చరణ్‌లతో ఓ మల్టీస్టారర్ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నాడన్న వార్తలొస్తున్నాయి.
శంకర్‌తో చరణ్ సినిమా కాస్త ఆలస్యం కావొచ్చేమో. అయితే.. మిగిలిన నలుగురిలో ఒకరి కథకు..చరణ్ ఓకే చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. నిర్ణయం మాత్రం చరణ్‌దే.