రామ్‌గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు కేఏ పాల్ తనపై చేసిన ఆరోపణలకు సోషల్ మీడియా వేదికగా వర్మ కౌంటర్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. వర్మ నా కాళ్లు పట్టుకున్నారనీ పాల్ చేసిన ఆరోపణలకు అవును నిజమే. కాళ్లు పట్టుకున్నాను. అప్పుడు ఆయన కాళ్లు పట్టుకుని కిందకి లాగేద్దామనుకున్నాను. అలా అయినా ఆయన తలకి దెబ్బ తగిలి మైండ్ కరెక్ట్‌గా పని చేస్తుందేమోననుకున్నాను అని వర్మ కౌంటర్ ఇచ్చారు.
దానికి కేఏ పాల్ దమ్ముంటే వర్మని ఓపెన్ డిబేట్‌కి రమ్మని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్‌కి వర్మ మీడియా ద్వారా స్పందించారు. అమ్మో కేఏ పాల్ అంటే జీసెస్ క్రైస్ట్. ఆయన ఏదో శాపం పెడతారు. ఆ శాపం నాకు తగిలి నా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. అందుకే ఆయన ముందుకు నేను రాను. నాకు కేఏ పాల్ అంటే భయం. వణుకు అన్నారు. ఈ మాటలు కేఏపాల్‌కి చెప్పొద్దు ప్లీజ్. ఇది చాలా సీక్రెట్. దయచేసి ఈ సీక్రెట్ ఆయన దగ్గరకు చేరవేయొద్దు.. అని ఇంటర్య్వూ చేసిన రిపోర్టర్‌కి మరీ మరీ చెప్పారు వర్మ.
తాను రూపొందిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలోని పాత్రల గురించి వివరిస్తూ, ఇందులోని పాత్ర ధారులంతా కొత్తవాళ్లనే తీసుకున్నామనీ, కొత్తవాళ్లను తీసుకోవడం వల్ల ఆ పాత్రలకున్న ఒరిజినాలిటీ మిస్ కాదనీ వర్మ తెలిపారు. లేటెస్టుగా విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుండగా, ఫిబ్రవరి ఫస్ట్‌వీక్‌లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి సంబంధించి మెయిన్ ట్రైలర్ విడుదల కానుందని వర్మ చెప్పారు.